Jump to content

పుట:వదరుబోతు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

మనుష్యుఁడేమి యెక్కుడు సౌఖ్య మనుభవించు చున్నాడు?

వానివలెనే మనమును సృష్టిలోని జంతు వులము. మనము జీవించియుండుట భగవదుద్దే- శము గనుక జీవించుచున్నాము.ఆతని యాజ్ఞ యైనపుడు ప్రపంచమును విడచుచున్నాము. ఈ మధ్యన మన చేఁతలచేఁ గలిగించుకొన్న కష్టము- లనో, సుఖములనో, యనుభవించుచున్నాము. ఈ చేతఁజేసిన దాచేత ననుభవింప వలయునని గదా పెద్దలు సెప్పుదురు.

'అవశ్యమనుభోక్తవ్యం కృతంకర్మశుభాశుభం'

కాని యీమతములు ధర్మాధర్మములు, వర్ణాశ్రమములు, కట్టు బాట్లు, వీనియాడంబర మేమి? జీవితానంతరమున మాత్రము మననెత్తిన శిఖర మెత్తుటకా యివి? మానవుని జీవితకాలమును సుఖ మాపాదించుటకుఁ గానిచోఁ తర్వాత నివి- యేల? ఈ యేడంతయు నుపవాసమున మలమల మాడి వచ్చు సంవత్సరము నిరంతరము పండుగుల ననుభవించుట కెట్టిమూర్ఖుఁ డిచ్చగించును? కా- వున వీని నిర్మించిన మహనీయుల యభిప్రాయ మేమైయుండును? సంఘమును బాగుపఱచుటకా? లేక ముక్తినొసఁగుటకా? వారు స్వర్గసంపాదన-