Jump to content

పుట:వదరుబోతు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

ఓ యీశ్వరుఁడా మాకదియు నిదియు నొసఁగి మాకోర్కెల సమకూర్పుమని గూడ, కొం- డఱు ప్రార్థనములఁ జేయుచున్నారు. మన కేది శ్రేయస్కరమో యేది కాదో, యెఱిఁగి యుండిన గదా మనమాతనిని 'ఫలాని' దిమ్మని కోర గలము. ఈశ్వరుఁడు సర్వజ్ఞుఁడే! అతనికి మన లోపములు దెలియవా? మన కావశ్యకము లగు నవి యాత్రఁడే యొసఁగ లేఁడా! ఇట్టి పిల్లి మ్రొక్కులు మ్రొక్కినవారియందు మాత్ర మతఁ డనుగ్రహించి తక్కినవారియెడ నిరాదరము గలిగియుండునా? దైవప్రార్ధనము భక్తితోఁ జేయువారు చేయని వారి కంటె నేవిధమున నిహమున నెక్కువ యభివృద్ధిఁ జెందుచున్నారు. అట్లేని తిర్యగ్జంతువులు భగవత్ సృష్టిలోనివి దైవప్రార్థన సేయుచున్నవా ? వానికి గూడ నొక మతమును స్వర్ణవంకముల జ్ఞానమును గలదా? భగవంతుఁడు వాని సౌఖ్యమునకుఁ గావ - లసిన దొసంగుట లేదా? పక్షులకుఁ దమ కులాయ ముల గట్టుకొను నేర్పును, చిన్న సింహమునకుఁ పెద్ద ఏనుఁగు సంహరింపఁగల శక్తియు, పొట్టేళ్ళకుఁ జలి దగులకుండునట్లు వెచ్చనియున్నియు,నిది యదియన నేల వాని సౌఖ్యమున కేమి గావలయునో యదియంతయు నాతఁడిచ్చుట లేదా? వానికంటె