Jump to content

పుట:వదరుబోతు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

గూర్చుండి యాలోచించుచుండు నంత, నాప్రాంత మున నరుగు బాలుఁడొకగీతము పాడుట వింటిని. నామది కది యొక వింత వికాసము గూర్చెను. ఆగీత

గీ|| చెట్టునకు మొగ్గదొడిగెడి చేష్ట గలదు,
     కోరకమునకు వికసించు గుణము గలను.
     విరికి వలపులు వెదజల్లు విద్య గలదు,
     వలపునకు గుబుల్కొను నలవాటు గలదు..
     ఇంత సౌభాగ్య మంతయు నెందు కొఱకు?

నిజము! ఇంత సౌభాగ్యమంతయు నెందు కొఱకు? కొంత తడవునకు నా యోజనాధోరణి మానవజన్మము వంకఁ దిరిగి యెప్పటి కీజన్మము. నకుఁ గృతార్దత యనుకొంటిని. చింతించుకొలఁది నొకటిపై నొకటి యాలోచనాతరంగము లుద యించి నా భావమును క్షణమొక వైపునకు ద్రిప్పుచు నెంతో తొందర చేయుచు వచ్చెనుగాని, "ఇదమిత్థ మని నిర్ధరించుకొనలేక పోతిని.

అర్థ మెఱింగియో, ఎఱుగకయో-ముప్పది వంతు లిదియే వాస్తవము పలువురు మోక్ష ప్రాప్తిచే మానవజన్మమునకు సాఫల్యమబ్బునం దురు. కాని యామాట శాస్త్రార్థమే! కాన నిది వదలితిని.