Jump to content

పుట:వదరుబోతు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతార్థత.

1

సంఘమర్యాదలు, గుణశీలములు, విద్యా వృత్తులు మున్నగు వానిలో నాలేఖలకు విషయ ములు కాఁగల యంశములు పెక్కులుంటంబట్టి వానిలో నెద్దాని గూర్చి తొలుత వ్రాయవలయు ఇని యాలోచించుచుండగనే వారము దినములు గడచెను. నవనాగరకత (Modern civilisation), గౌరవ బిరుదములు (Sounds of Honour), భౌతిక సంపత్కళలును (Material Prosperity) బలు మాఱు నాస్మృతి పథమునం దిగులుచుండెను. కాని, యిప్పటి సంఘములో నగ్రమర్యాద వానికే యున్నఁగూడ నాకవి రుచించినవికావు. ఏదియుం దోపక యొక సాయంతనమున నగరారామ (Public Park) ప్రాంతమున బచ్చికతిన్నెపి