Jump to content

పుట:వదరుబోతు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

ఇక సనుభవమున నీవిషయమై జనుల యభిప్రాయము పలుతెఱఁగులుగ నున్నది. వారి వారి యభిరుచికిని, సాంగత్యమునకును, అభ్యాస మునకును, వివేకమునకును దగినట్లు వారు నిర్దరించు కొందురు. ధనమే ప్రపంచమున కాధారభూత మని నమ్మి, కుడువక, కట్టక, ప్రాణము పోయినను సరే పణపుసంచి ముడి విప్పరాదని లక్ష్మీ దేవి నూపిరి యాడకుండఁ బాతిపెట్టుచుఁ గొల్లలుగ నార్జించి లోభి "ధన్యోస్మి" యనుకొనును. పని పాటలు లేక వివిక్తస్థలమునఁ గూర్చుండి, ఏ యూరుబిచ్చుకపైననో, ఏ గురువింద పొదను గూ ర్చియో, పోలు పొందు లేని యుత్ప్రేక్షోపమాన ములతో, బద్యము లల్లుచుఁ గవులు నిర్భరానంద మనుభవింతురు. సృష్టికర్త స్త్రీ లింగము ప్రసా- దించియున్నను "కళత్ర"మునకు నపుంసక లింగ మును దమంత నారోపించి లేని తంటాలు పడుచు నెన్నెమ్ముల కంటులాగు శాస్త్రము గంఠపాఠము చేసి వైయాకరణు లానందింతురు. పెరటి వాకిటఁ పదుగు రిలుపొచ్చి యిల్లాలి యోగక్షేమము లరయుచున్నఁ గూడఁ తెలియనేరక వసారాలోఁ జిరుచాపపైఁ గూర్చుండి గుణితము వేయుచు నాక సమునఁ జంద్రుఁడు విశాఖ కడకేగు కాలము తేలి