Jump to content

పుట:వదరుబోతు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiv

మేలయను నౌదాసీన్యముగూడ రెండవ కారణ ముగా నుండవచ్చును. ఈ వ్యాసకర్తల నెఱిగిన మిత్రులు కొందఱు వారియందీ స్వార్థ రాహిత్యము ఎంత నేఁటికిని కలడనుట యెఱుఁగుదురు. యుద్దేశములట్లే యుండుటచే ఇప్పుడును వారి నామ ములు మఱుఁగుననే యుంచఁబడినవి.

ఈ‘వదరుబోతు' జన్మించినది, పనిచేసినది సన్యసించినదిగూడ అనంతపురమందే. అపుడా యూరిలో నుండినది ఆచార్యుల గుఱ్ఱపు తట్ట... పదిప్రక్కలందును పదిమంది చేతులు వేసి నడప వలసిన ప్రాఁత 'ప్రెస్సు' ఒకటే. అది సా ... విలాస ప్రెస్సు'. అన్ని పనులకు అదే ఆధారము చేతడబ్బు ఎక్కువలేక, అధికారము లేమియు యున్న వారు ఆకాలములో పక్షమున కొక క్లుప్తముగా నాలుగైదు పుటల వ్యాసము ముద్రింపించు భగీరథ ప్రయత్నమాపని చేసిన తప్ప నితరు లెఱుఁగలేరు. ఎట్లో కష్టపడి ముద్రిం పించి వ్యాసములను కాలణా కొకటిగా వీరు అమ్మి, పోస్టుకర్చులు పెట్టుకొని బైటి కెందరికో ఉచితముగా పంపి, ఎన్నో ప్రతులు తిరిపెము సుమారు రెండేండ్లకుమించి దీనినినడిపి త - సుప్రసిద్ధ కారణములచేత 'వదరుబోతు'