Jump to content

పుట:వదరుబోతు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

గొందఱట్టివేమైన వ్రాసిరేమో మాదృష్టికి రాలేదు.

ఈవ్యాసకర్తలు ఇరువురు; ముగ్గురన్నను తప్పులేదు. వారి పేళ్ళు ప్రచురించుటకు మాకిప్పు డధికారములేదు. మొదలువారు ప్రకటించుకో లేదు. కారణము మాకుఁజూడఁగా నిది: అధికార వృద్ధులు, వయోవృద్ధులు, విద్యావృద్ధులుగూడ నాచరించుచుండిన కొన్ని పద్ధతులను ఆచారము లను తప్పులని తోఁచినప్పుడు విమర్శించి ఖండిం చుటకై జన్మించిన వీవ్యాసములు. ఈ వ్యాసకర్తలు అధికార విద్యావయోధనాదులందు సామాన్యులే కాని విశిష్టులు గారు. అట్టివారు ఇతరులను ఖం డింపఁ బూనినప్పుడు వారిపేరు ప్రచురమయ్యెనా వారిననామధేయులకన్న నల్పముగాఁదలఁచి తిర స్కరించుజనులే యెక్కువ. తమ్ము ఖండించువార నామధేయులుగా మఱుఁగున నుండి వారెవరో సుగృహీత నామధేయులని జనులు భావించి మన్నించుటయు సహజము. కావున సంఘమందలి లోపములను వెలికిఁబెట్టుటయే ప్రధానోద్దేశముగాఁ గల 'వదరుఁబోతు' వ్రాయసగాండ్రకు తమ పేరు మఱిగించుకొనుటయే కార్యసాధన మార్గముగా తోఁచియుండును. మఱియు సంఘసేవాకార్యము నకు తోడు స్వసేవయగు నీనామధేయ ప్రకటన