Jump to content

పుట:వదరుబోతు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

తెగువ 'వదరుఁబోతు' తిట్లకులేదు. 'వదరుబోతు" తిట్లలోని తీపు 'సాక్షి' తిట్లకులేదు. ఉదాహరణ ముగా వీరిరువురును చేసిన సారంగధర నాటక విమర్శను చూచినచో నీవిషయము స్పష్టమగును. ఇంతకన్న నెక్కు_వచర్చది చోటుగాదు.

ఇదిగాక ఇంచు మించుగా నీ వదరుబోతు జన్మించిన కాలమందే గుంటూరునుండి కాఁబోలు నొక్కరు ఇట్లే కొన్ని వ్యాసములు ప్రకటించు చుండిరి. వాని పేరు ప్రకృతము మఱచితిమి. ఎట్లో వారు మకుటముగా నుంచుకొని యుండిన ఈక్రింది పద్యమొకటి జ్ఞప్తిలో నిలిచినది.

"తే. ఉద్ధరించెద దేశమేనొక్కరుఁడ నె
     నిక్కమియ్యది చేయంగ నేర రొరులు
     అనుచు విలియము పిట్టను నతఁడు పలికె;
     అట్లయందఱుఁ దలఁచిన నగును శుభము."

గుంటూరు మిత్రు లొక్కరివద్ద నీ వ్యాసపత్ర ములు రెండుండఁగాఁ జూచియుంటిమి గాని యితరు. లీప్రాంతములలో నెవరును వాని నిదివఱకు కని యెఱుఁగరు. వినియెఱుఁగరన్నను తప్పులేదు.

ఈవల కీ॥శే॥ వంగూరు సుబ్బారావుగారు 'వసంత లేఖలు' అను పేర కొన్ని వ్యాసముల నాంధ్ర పత్రికలో ప్రకటించుట సర్వవిదితమే.ఇంకను