Jump to content

పుట:వదరుబోతు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv

మూసికొనెను. మొత్తము ప్రకటించిన వ్యాస ములు సుమారు 5ం.

కాని ఇప్పుడు వాని నెల్ల నొక సంపుటము గా ప్రకటింపఁ బూనుకొనఁగా దొరికినవి 22 మాత్రమే. కర్తలు స్థలాంతరములకుఁబోయి కార్యాంతరములకుఁజిక్కి పోవుటచేతను, ఒకతూరి వ్రాసి పంచిపెట్టుటచేత తాము తలపెట్టిన పని యైనది గావున నీవ్యాసములను భద్రపఱచియుంచ వలసినంత యక్కడ వారికంతగా లేకపోవుటచేతను పై వ్యాసములలో ననేకములు దుర్లభములైనవి. కాని చదువరులలో హిందూపురము శ్రీ పక్కా గురురాయాచార్యులవంటి యభిమానశాలు లుండ బట్టియే ఈ వ్యాసములిన్ని యైనను నేఁటికి దొరకి నవి. ప్రకాశకులు వారికి కృతజ్ఞులు. తక్కినవి యెంత ప్రయాసపడినను దొరకవయ్యెను. ఎవరి వద్దనైనను ఇప్పుడు లభింపని వ్యాసములున్నచో దయచేసి యిచ్చినచో ప్రకాశకులు కృతజ్ఞలతో నందుకొని యవకాశము లభించినప్పుడు చేర్చి ప్రకటింతురు.

వ్యాసకర్త లుదాసీనముగా నున్నను, కాల మెంత మాఱినను, ఇంకను ఈ వ్యాసములు చేయ వలసిన ప్రబోధకార్యమున కవకాశముగలదని తోఁ