93
వారి వంటి వేషముగల వంటలవారు గొందఱు పఙ్తిపైఁ బ్రత్యక్షమైరి. ఇక నాఁటి పదార్థ ముల సారస్యము మున్నెన్నడును కని విని యెఱుఁ గనిది. ఆదినమున అమాడిన యన్నమునకును ఆయుడుకని పప్పునకును గలయొద్దిక వర్ణనాతీతము. పులుసును చారును మాటిమాటికిని స్నానముచే యనిదే బయట వచ్చుచుండ లేదు. పాయస మన్ననో పాలును చక్కెరయును లేని వింతరకపు వంట. మజ్జిగ యయినవెనుక చేయి గడిగికొను యవసరమే యుండలేదు.
గీ|| నేయిలేని కూడు నీయాన కసువది
కూర లేనితిండి కుక్కతిండి:
ప్రీతిలేనికూడు పిండంపుకూడురా
విశ్వదాభిరామ వినరవేమ!
అను పద్యము నాకు స్మరణకు వచ్చినది. లహా! వరుఁడు చింతామణి! కన్య అన్నపూర్ణ! యజమాని యింటిపేరే అన్నదానమువారు!! లగ్న పత్రికలచే పిలువనంపి వచ్చిన యతిథుల కీ యందరము!! ఈకొఱ్ఱకూటికా యీఘోషశాంతి? ఈ అన్నదానము వారి యాదార్యమున కింకెన్ని బిరుదములైనను చాలవు.
ఆర్యా! వచ్చినపని యయినది. 'నేఁడిం