Jump to content

పుట:వదరుబోతు.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

మాడుచుండెను. వేరొక్క చోట చీట్లపేక వ్యవ హారము యధావిధిగా జరుగుచుండెను.మఱి యొకగదిలో “గౌరవనీయులు” గొందఱు పాస కేళిలోఁ దేలుచుండిరి. ఇంకొక్కశాలలో యువ కులు కొందఱుచేరి యథేచ్ఛముగా హార్మోనియ మును వాయించుచుండిరి. వివాహముహూర్త మెప్పుడో, జరుగవలసిన క్రియాకలాపమేమో గమ నించువారే యీసంఘమున నున్నట్లు నాకుఁ దోపలేదు. ఎన్ని చోట్లఁ దిరిగినను, ఎందెందు కూర్చుండినను, నన్ను మాటలాడించిన పాపమునఁ బోయినవారే లేరు.

మధ్యాహ్నము రెండుగంటలు మీఱుచు న్ననుగూడ నాస్థితిలో నేమార్పును గలుగలేదు. దాదాపు మూడు గంటలపుడు వైదికులందఱు భోజనశాలకు నడువుఁడని యొకఁడు ఘంటవాయిం చుచుఁ బిలిచిపోయెను. ఈసమారాధనము సయి తము చవిఁజూచి పరీక్ష జాలింతమనుకొని నేనును భోజనశాల కరిగితిని. నాగరకుల భోజనాదులు పది ఘడియల కే ముగిసినవఁట! ఇప్పుడు జరుగు చున్నది. వైదికుల పండుగు. రమారమి రెండు వందలమంది విస్తళ్లముందు కూర్చుండి యరఘంట సేపు కాచుకొనియుండు నంతలో పొగబండినడుపు