ఈ పుట ఆమోదించబడ్డది
94
చుక విశ్వాతి గైకొని రేపు తమ సన్నిధికి వెడలి వచ్చెద.
అని విన్నవించు ప్రియశిష్యుఁడు,
రామానందుడు.”
స్వాభావిక శక్తి
16
సర్వజ్ఞుఁడగు నీశ్వరుఁ డేపనియును వ్యర్థముగాఁ జేయఁడు. ప్రపంచమునందలి ప్రతిపదార్థము నేదేనొక్క ప్రయోజనంబుపొంటె నాతనిచే సృజింపఁబడినది. ప్రతిమనుజుఁడు నేదేనొక్క కార్యమున కయి యాతనిచే నుద్దేశింపఁబడినాఁడు. ఏమార్గముననుసరింప సర్వేశ్వరుని యుద్దేశమో, ఆమార్గమునకు భిన్నముగాఁ బ్రవర్తించువాఁడు ప్రపంచయాత్రను జయప్రదముగాఁ గొనసాగింప లేఁడు. అసమర్ధత, అవమానము, ఆశాభంగము, ఇత్యాదు లాతఁ డేర్పఱచిన మార్గముగాక వేరు త్రోవ ద్రొక్కుటవలననే గలుగుచున్నయవి.
తన యభివృద్ధికిని తన వారి 'మేలునకును గూడ కారణములగు సుగుణములు ప్రతివాని యందు నొకటి రెండైన నుండును. అట్టివానిని