సర్ ఆర్థర్ కాటన్ మునిమనుమడు చార్లెస్ రాబర్ట్ కాటన్ "ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్" సభ్యత్వ గౌరవాన్ని పొందారు. 1925 డిసెంబరు 31వ తేదీన ఇంగ్లండ లో లివర్‌పూల్‌లో ఆయన జన్మించారు. డెర్బీషైర్‌లోని రిప్టన్ స్కూలులోనూ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మెక్‌డవిన్ కాలేజిలోను చదివి, మెకానికల్ సైన్సెస్ మరియు సివిల్ ఇంజనీరింగులో రోస్టర్ డిగ్రీ పొందారు. నేషనల్ కమిషన్డ్ రాయల్ ఇంజనీరింగు పక్షాన 1946-48 సంవత్సరాల మధ్య భారతదేశంలోను, పాలస్తీనాలోను పనిచేశారు. ఇంటర్నేషనల్ ప్యాకింగ్ కంపెనీ, మెటల్ బాక్స్‌లో వివిధ హోదాలలో పనిచేసి, 1933 సంవత్సరంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి పొందారు. 1952-54 సంవత్సరం మధ్య మెటల్ బాక్స్ కంపెనీ కలకత్తా కార్యాలయంలో పనిచేశారు. వీరి భార్య శ్రీమతి నికోలెట్ ఆనీకన్లీవ్. వీరికి నలుగురు పిల్లలు, 13 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. ఉద్యోగ విరమణానంతరం సమాజ సేవలో తమ జీవితాన్ని గడుపుతున్నారు. చార్లెస్ రాబర్ట్ కాటన్ 84 సంవత్సరాల వయసులో రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా మన రాష్ట్రంలో పర్యటించడం హర్షదాయకం.
చార్లెస్ రాబర్ట్ కాటన్ దంపతుల పర్యటనలో సర్ ఆర్థర్ కాటన్ పట్ల తెలుగు ప్రజలకున్న ఆరాధనాభావం అడుగడుగునా వ్యక్తమయింది. మా లండన్ పర్యటన ఫలితంగా ఈ కార్యక్రమం ఈ విధంగా రూపుదిద్దుకోవడం మాకెంతో సంతృప్తి నిచ్చింది.
★★★
77