పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు భగీరథుడు

సర్ ఆర్థర్ కాటన్

"నిత్య గోదావరీ స్నానపుణ్యదోయోమహామతిః
స్మరామ్యాంగ్లేయదేశీయం, కాటనుం తం భగీరథం"

ఒక వేదపండితుడు గోదావరిలో స్నానమాచరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో పై శ్లోకం పఠించి, పూజలొనరుస్తుంటే, ఆ శ్లోకంలోని "కాటన్" అన్న పదం వినపడి, ఆ దారిన గుర్రం విూద వెళుతున్న తెల్లదొర ఒక్కసారిగా గుర్రాన్ని నిలిపి, ఆ పండితుణ్ణి పిలిచి, దాని అర్థమేమిటని ప్రశ్నిసాడు. "పవిత్ర గోదావరీ జలాలతో అనుదినం స్నానపానాదులాచరించగల పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు, భగీరథతుల్యుడు, ఆంగ్లదేశీయుడైన కాటన్ను స్మరిస్తున్నాను" అని దానర్ధాన్ని వేదపండితుడు చెబుతాడు. అంతట ఆ తెల్లదొర "కాటన్ జీతం తీసుకుని పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆనకట్టలుకట్టి, కాల్వలు త్రవ్వి పంటలకు నీరందించడం ఆయన ఉద్యోగ ధర్మం. ఆయన తన విద్యుక్త ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాడు. అంతమాత్రానికే విూరాయనను దేవునిగా భావించి,

65