ఈ పుట ఆమోదించబడ్డది
తెలిసినంతవరకు విూరే" అని చెప్పారు. ఆ విషయం పత్రికలలో రావడం, దానివిూద అంతకు పూర్వమే సమాధిని సందర్శించినవారు "మేము ఎప్పడో చూశామ"ని ప్రకటనలు చేయడంతో అదొక వివాదంగా పరిణమించింది. అయితే, దీనివల్ల తెలుగువారందరికీ బ్రౌన్ సమాధి గురించి తెలుసుకునే అవకాశం కలిగి, గొప్ప కుతూహలాన్ని రేకెత్తించింది. కీడులో మేలన్నట్లుగా ఈ వివాదం ద్వారా బ్రౌన్ సమాధి ప్రశస్తిని అందరూ గుర్తించే అవకాశం లభించింది. ఏదిఏమైనా ఈ రోజున లండన్ తెలుగు సంఘం ఒక మహత్తరమైన కృషి జరిపి, తెలుగు భాషా భానుణ్ణి మళ్ళీ ప్రకాశింపజేసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ అధ్యక్షులు డా॥రాములు దాసోజుకు, వారి కార్యవర్గానికి తెలుగు ప్రజలందరి తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.
64