పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాత్రి లండన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు డా. రాముల దాసోజు మమ్మల్ని విందుకు ఆహ్వానించారు. వారితో నాకు అంతకు పూర్వం పరిచయం లేదు. డా. లక్ష్మీప్రసాద్ గారి ద్వారా కలిగిన పరిచయమది. స్వర్గీయ ఎన్.టి. రామారావుగారు లండన్లో పర్యటించిన సందర్భంలో వారి ఇంటనే బసచేసిన విషయాన్ని రాముల దంపతులు గుర్తు చేసుకున్నారు.

మేము బ్రౌన్ సమాధి గురించి, దాని దురవస్థ గురించి వారి దృష్టికి తెచ్చాము. వారు తమ సంఘ సభ్యులతో చర్చించి, దాని పునరుద్ధరణకు పూనుకుంటామని మాటిచ్చారు. ఈ రోజున దాదాపు 2 లక్షలు వ్యయం చేసి బ్రౌన్ సమాధిని లండన్ తెలుగు సంఘం వారు పునరుద్ధరించడం యావత్ తెలుగు జాతికి ఎంతో ఆనందదాయకం. ఇందుకుగాను లండన్ తెలుగు సంఘాన్ని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. లండన్ సందర్శనకు వెళ్ళే ప్రతి తెలుగువాడు కెన్‌సల్ గ్రీన్ స్మశాన వాటికలో సి.పి. బ్రౌన్ సమాధిని సందర్శించడం ద్వారా అదొక యాత్రా స్థలంగా రూపుదిద్దుకొంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

శ్రీ సి.పి. బ్రౌన్ ఫోటో ఇంతవరకు లభ్యం కాలేదు. ఇంగ్లాండులో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఏదో ఒకరోజున ఆ ఫోటో కూడ లభ్యం కావాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం బ్రౌన్ ఊహాచిత్రాన్నే ఉపయోగిస్తున్నాము.

మేము లండన్ పర్యటనకు వెళ్ళివచ్చిన పిమ్మట బ్రౌన్ సమాధి గురించి పత్రికలలో చదివిన వారిలో కొందరు లండన్ వెళ్ళినపుడు బ్రౌన్ సమాధిని చూసి వచ్చామని ఎంతో సంతోషంగా చెప్పారు. వారిలో తిరుమల తిరుపతి దేవస్థానాల పూర్వపు అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డిగారు ఒకరు.

మేము ఆ స్మశానవాటిక సందర్శనకు వెళ్ళినపుడు దానికి ఇన్ చార్జిగా వున్న శ్రీమతి ఎవిస్ "ఈ సమాధిని సందర్శించడానికి వచ్చినవారు మాకు

63