ఆరాధించాలా" అని అంటాడు. అంతట ఆ పండితుడు "దొరగారూ! విద్యుక్త ధర్మనిర్వహణ దైవలక్షణం. అట్టి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే వారెవరైనా దైవ స్వరూపులే. ఈ గౌతమి మండలాన్ని గోదావరీ జలాలతో సస్యశ్యామలం చేసి, మా బ్రతుకుల్లో పాలు పోశారు కాటన్ దొరగారు. అందుకే ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాను" అని సమాధానం ఇస్తాడు. ప్రక్కనే ఉన్న దుబాసి మిూరు ఆరాధిస్తున్న కాటన్ దొరగారు వీరేనని పండితునికి చెబుతాడు. "దొరగారూ! మీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించిందని ఆ పండితుడు కాటన్ దొరకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు.
తాను పడిన శ్రమకు ప్రజల నుంచి అంత గుర్తింపు లభించినందుకు కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలాయి. 150 సంవత్సరాలుగా ఆ శ్లోకం గోదావరీ తీరాన ప్రతిధ్వనిస్తూనే ఉంది. కాటన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఈ నాటికీ నిలిచే ఉన్నాడు.
నీటిపారుదల పితామహుడు 'జలప్రదాత' సర్ ఆర్థర్ కాటన్
గోదావరి, కృష్ణా నదుల మీద ఆనకట్టలు కట్టడం ద్వారా అక్కడి బంజరు భూములన్నింటినీ సస్యశ్యామలంగా మార్చవచ్చని బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సఫలీకృతుడైన కాటన్ దొర గోదావరి నది మీద 1847-52 సంవత్సరాల మధ్య కృష్ణా నది మీద 1852-1855 సంవత్సరాల మధ్య ఆనకట్టలను నిర్మించాడు. ఈనాడు కృష్ణా, గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా, పాడిపంటలతో విలసిల్లుతున్నాయంటే దానికి కారణం ఆ మహనీయుడే.
11.4.1970న ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో శ్రీ నార్లవెంకటేశ్వరరావు ఈ విధంగా వ్రాశారు : "ప్రధాని నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఒక రైతు ఆయనతో "ఇది మీరు పెట్టిన దీపమే" అన్నాడు. నాగార్డున సాగర్ నెహ్రూ పెట్టిన దీపం కాగా, గోదావరి ఆనకట్ట, అంతకు నూరేళ్ళకు ముందు సర్ ఆర్థర్ కాటన్ పెట్టిన దీపం. దక్షిణ భారతంలో కాటన్ పెట్టిన పెక్కు దీపాల్లో అదొకటి. కాటన్ ఆనాడు పెట్టిన
66