పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాళవరాజు నుంచి కైవసం చేసుకున్నాడు. ఆ సందర్భంలో మాళవరాజ్యం నుంచి కొల్లగొట్టిన అపార ధనరాసుల్లో ఈ వజ్రం కూడా ఉంది. యువరాజుగా వుండిన అల్లావుద్దీన్ 1295లో తన పినతండ్రి అయిన ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్‌ను దారుణంగా హత్యచేసి, ఢిల్లీ సింహాసనం ఆక్రమించుకున్నాడు. ఆ తరువాత మాళవ రాజుల నుంచి గుజరాత్‌ను కూడా తన వశం చేసుకుని అక్కడి ధనరాసుల్ని ఢిల్లీకి తరలించాడు. ఒక వాదన అల్లావుద్దీన్ ఈ వజ్రాన్ని దక్కన్‌లో హస్తగతం చేసుకున్నాడని వుండగా, మరొక వాదన దీనిని గుజరాత్‌లో మాళవరాజుల నుంచి చేజిక్కించుకున్నాడని వినిపిస్తున్నది.

ఆ తరువాత 200ల సంవత్సరాలకు 1526లో పానిపట్టు యుద్ధంలో బాబర్ అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీంలోడీని సంహరించి, ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఈ యుద్ధంలో ఇబ్రహీంలోఢీ పక్షాన పోరాడిన గ్వాలియర్ రాజు విక్రమాదిత్య కూడా హతుడైనాడు. ఈయన ఆగ్రా కోటకు రక్షకుడు కూడాను. కాబట్టి యుద్దానికి వెళ్ళేముందు విక్రమాదిత్య తన సమస్త సంపదను భద్రత కోసం ఆగ్రా కోటకు తరలించాడు. అందులో ఈ అమూల్య వజ్రం కూడా వుంది. బహుశః అల్లావుద్దీన్ తాను దోచుకుతెచ్చిన ఈ వజ్రాన్ని విక్రమాదిత్య పూర్వీకులకు, వారు తన పట్ల చూపిన విశ్వాసానికి గుర్తింపుగా, గ్వాలియర్‌తోపాటు ఇచ్చివుంటాడు.

ఢిల్లీని ఆక్రమించుకున్న తరువాత బాబర్ ఆగ్రాకు 1526 మే 4వ తేదీన వెళ్లాడు. అక్కడ బాబర్‌కు లభించిన అపార సంపదలో ఈ వజ్రం కూడా ఉంది. ఆ విధంగా ఈ వజ్రం మొగలాయిూల వశమైంది. అయితే, బాబర్‌నామా ఈ సంఘటనను మరో విధంగా చెబుతున్నది. అది :

"బాబర్ కుమారుడు హుమాయూన్ ఆగ్రాకు వచ్చినపుడు, విక్రమాదిత్య అంతఃపుర పరివారం పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే హుమాయూన్ సైన్యం వారిని చుట్టుముట్టి కదలనీయలేదు. హుమాయూన్ వారిని దోచుకోవడానికి తన సైన్యాన్నీ అనుమతించలేదు. వారు ఇష్టపూర్వకంగా అనర్ఘరత్నాలు, ఆభరణాలు వున్న ఒక పేటికను హుమాయున్‌కు

38