బహూకరించారు. అందులో సుల్తాన్ అల్లావుద్దీన్ మాళవరాజు నుంచి దోచుకొచ్చిన ఈ ప్రఖ్యాత వజ్రం కూడా వుంది. ఇది ఎంత విలువైందంటే - దీనిని పరిశీలించిన వజ్రాల నిపుణుడొకడు ప్రపంచం మొత్తం ఒక రోజులో చేసే ఖర్చులో సగం వుంటుంది దీని విలువ అని పేర్కొన్నాడు. హుమాయూన్ ఆగ్రా నుంచి తెచ్చిన సంపదతో పాటు ఈ అమూల్య రత్నాన్ని నాకు సమర్పించుకున్నాడు. అయితే, ఈ రత్నాన్ని అతనికి బహుమతిగా తిరిగి ఇచ్చివేశాను".
ఇంకొక కథనం ప్రకారం ఇబ్రహీంలోఢి తల్లి స్వయంగా ఈ వజ్రాన్ని హుమాయూన్ పరం చేసింది. ఆగ్రా కోట మొగలాయిల వశమైనపుడు ఇబ్రహీంలోఢి అంతఃపురస్త్రీలు, విక్రమాదిత్య అంతఃపుర స్త్రీలు ఒక భవనంలో తలదాచుకున్నారు. ఖజానా గురించిన సమాచారం కోటలో ఎవరూ ఇవ్వలేదు. చివరికి ఒక పరిచారిక ఆ భవనంవైపు చూపింది. హుమాయూన్ తన బలగాలతో, ఆ భవనంలో ప్రవేశించగా, విక్రమాదిత్య కుటుంబానికి చెందిన స్త్రీలు భయకంపితులై పెద్ద పెట్టున రోదించడం మొదలు పెట్టారు. అప్పుడు హుమాయూన్ వారి గౌరవానికి ఏ రకమైన భంగం వాటిల్లదని హామి యివ్వగా అల్లావుద్దీన్ తల్లి ఒక గదిలో నుంచి వణుకుతున్న చేతులతో ఒక బంగారు మందసాన్ని తెచ్చి హుమాయూన్ చేతుల్లో పెట్టింది. అందులో మిగతా ఆభరణాలతో పాటు ఈ వజ్రం కూడా వుంది. అయితే ఈ కథనాన్ని ఎవరూ నమ్మడం లేదు.
ఏది ఏమైనప్పటికీ ఈ వజ్రం ఆగ్రా కోట నుంచి మొగల్ చక్రవర్తుల చేతుల్లోకి మారిందన్నది మాత్రం సత్యం. బాబర్ కథనం ప్రకారం అప్పట్లో దీని బరువు సుమారు 8 మిస్కాలు. దీన్ని లెక్కించిన చాలామంది ఇది 186 (పాత) క్యారట్ల బరువుందని వ్రాశారు.
బాబర్ పానిపట్టు యుద్ధంలో ఘన విజయం సాధించిన నాలుగు సంవత్సరాలకు హుమాయూన్ జబ్బు పడ్డాడు. ఈ జబ్బు నివారణకు
39