మన కొల్లూరు - కోహినూర్ వజ్రం
థేమ్స్ నది ఒడ్డున వున్న ఒక ప్రాచీనమైన కోట "టవర్ ఆఫ్ లండన్", మధ్యయుగంలో రాజప్రాసాదంగా విరాజిల్లి 15 ఎకరాలలో నేడు ప్రపంచ ప్రసిద్ధ పురావస్తుశాలగా వాసిగాంచిన కట్టడమిది. లండన్ టవర్లో కోహినూర్ వజ్రాన్ని తిలకించడం ఒక మధురానుభూతి. తెలుగునాట దొరికి, వజ్ర సంపదలో తలమానికంగా పేర్కొనబడే కోహినూర్ వజ్రం భారతదేశానికి గర్వకారణం. మహాభారత కాలం నాటి శమంతకమణి ఇదేనని కొందరు భావిస్తున్నారు. చిత్ర విచిత్రమైన చరిత్ర ఈ కోహినూర్ వజ్రాన్ని ఆవహించి ఉంది. ప్రముఖ పరిశోధకులు శ్రీ దిగవల్లి శివరావుగారు తమ "కథలు-గాథలు" 2వ భాగంలో కోహినూరు వజ్రం గురించి అనేక విశేషాలు వ్రాశారు. లండన్ టవర్లో కోహినూరు వజ్రాన్ని చూడగానే అవన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. తిరిగి వచ్చిన తరువాత ఆసక్తి మరింత పెరిగి, కోహినూరు వజ్రానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఎన్నో విశేషాలు తెలిశాయి.
కోహినూరు (Koh--Noor) అనగా "తేజ పర్వతం" అని అర్థం. ఇది పర్షియన్ పదం. ఒక మహాపర్వతమంత కాంతిని ప్రసరింపజేయగల
36