చెక్కతో షేక్స్‌పియర్ తండ్రి నిర్మించిన ఈ ఇంటిని అతి పదిలంగా కాపాడుతున్నారు. దీనిని "షేక్స్‌పియర్ బర్త్ ప్లేస్ ట్రస్ట్" నిర్వహిస్తున్నది. దీనిని "సాహిత్య ప్రేమికుల మక్కా"గా వ్యవహరిస్తారు. ఇంగ్లాండ్ సందర్శనలో నన్ను అమితంగా అలరించిన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ ఇంటి వెనుక భాగంలో ఒక చిన్న ఉద్యానవనం ఉంది. ఈ తోటలో పేక్స్పియర్ కాలం నాటి పూల మొక్కలను, ఔషధ మొక్కలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ తోటలోని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ శిలాప్రతిమ నన్ను విశేషంగా ఆకట్టుకుంది. దీనిని అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ జ్యోతిబాసు బహూకరించారట. ప్రపంచ ప్రసిద్ధ కవి పేక్స్పియర్ నివాస ప్రదేశంలో విశ్వకవి రవీంద్రుని ప్రతిమను చూసి, భారతీయుడుగా నా హృదయం పులకించిపోయింది. భారతీయ సాహిత్యానికి దక్కిన అపురూప గౌరవంగా దీనిని నేను భావించాను.
గార్థ్ హౌస్
డార్కింగ్ నగరంలో సర్ ఆర్థర్ కాటన్ నివసించిన ఇంట్లో ప్రస్తుతం " హౌస్’ పేరిట ప్రయివేట్ నర్సింగ్‌హోం-కం-ఒల్టేజి హోం నిర్వహించబడుతున్నాయి. దీనిని మహారాణిగారి వైద్యుడు లార్డ్ హార్డెన్ 1949లో అధికారికంగా ప్రారంభించాడు. ఒక సుందరోద్యానవనంలో గత శతాబ్దాంతంలో నిర్మించబడిన ప్రసిద్ధ భవనమిది. ఈ భవనం గదుల నుంచి చూస్తే, ఎత్తైన కొండలు, సువిశాలమైన ఉద్యానవనం, అందులో సమున్నతంగా నిలిచిన మహావృక్షాలు, పూలమొక్కలతో కనులపండువుగా దర్శనమిస్తూ, ఒడ్లను ఒరుసుకుంటూ పారే ప్రవాహాలు కనిపిస్తాయి. అదొక ప్రకృతి శోభతో అలలారే అద్భుత ప్రదేశం. అక్కడి వారందరూ వయసు పైబడిన పిమ్మట ఈ గార్థ్ హౌస్‌లో చేరాలని ఉవ్విళ్ళూరుతుంటారట. ఇక్కడ వుండే ప్రతి ఒక్కరిని వ్యక్తిగత శ్రద్ధతో, వారెప్పడూ మానసికోల్లాసంతో వుండేటట్లు చూడటమే తమ ధ్యేయమని నిర్వాహకులు చెప్పారు. ఇక్కడ దీర్ఘకాలిక వసతితోబాటు, స్వల్పకాలిక వసతి