ఒక ఇంటిని నిర్మించుకొని, తన సోదరి డోర్తీతో అక్కడికి తరలివెళ్ళి, అక్కడే వుండిపోయాడు.
ప్రశాంత వాతావరణం, కొండలు, కొండలను తాకుతున్న మేఘాలు, సన్నటి వర్షపు జల్లులు, ఎలాంటి వారికైనా కవితావేశం తెప్పించే ప్రకృతి అందాలు అక్కడ దర్శనమిస్తాయి. సహజంగా కవి అయిన వర్డ్స్‌వర్త్ ఈ వాతావరణంలో తన్మయుడై వ్రాసిన "I Wandared Lonely as a Cloud" వంటి కవిత్వం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. డోర్తీ కూడా గ్రాసమర్ జర్నల్ వంటివి అక్కడి నుంచే వ్రాసింది.
వర్డ్స్‌వర్త్ నివసించిన "డౌన్ కాటేజి" సందర్శనలో ఆయన నిత్య జీవితం గురించి, రచనల గురించి, ఆయనను సందర్శించిన వారి గురించి సమగ్రమైన సమాచారం పొందవచ్చు వర్డ్స్‌వర్త్ రచనల వ్రాత ప్రతులు కూడా అక్కడ మనం చూడవచ్చు. ఈ పర్యటనలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన విషయం ఇంగ్లాండ్ దేశీయులలో వారి కవులపట్ల గల అపార గౌరవాభిమానాలు. వారు నివసించిన ప్రదేశాలు చెక్కు చెదరకుండా కాపాడుతూ, వారు వాడిన వస్తువులు, వారి రచనలు ప్రదర్శనకు ఉంచి, వారి పేర ప్రయివేట్ ట్రస్టులను ఏర్పాటు చేసి, ఆర్థిక అవసరాలకు ప్రభుత్వంపై ఆధారపడకుండా, అవసరమైన డబ్బును, సందర్శకుల నుంచి, అభిమానుల నుంచి సేకరించి, స్మృతి చిహ్నాలను పదిలపరచడం, నన్ను అబ్బురపరిచింది. ఈ రకమైన ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి మనదేశంలోని, ప్రత్యేకించి మన రాష్ట్రానికి చెందిన కవులు, కళాకారులు, నాయకుల స్మృతులను శాశ్వతం చేసే ప్రయత్నం చేయాలి.
విలియం షేక్‌స్పియర్ జన్మస్థలం
ఇది ఇంగ్లాండ్‌లోని వార్‌విక్‌షైర్లో ఉంది. 16వ శతాబ్దపు ప్రఖ్యాత కవి విలియం పేక్స్పియర్ స్మారక మ్యూజియం ఇందులో ఉంది. 16వ శతాబ్దంలో