పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కూడా ఉంది. కొందరు సెలవుల్లో వచ్చి విశ్రాంతిగా కొన్నాళ్ళు గడిపి పోతుంటారు. ఇక్కడ చాలా కాలంగా ఉంటున్న వారంతా 80-90 ఏళ్ళ పైబడినవారే!

వృద్ధుల సంక్షేమం పట్ల ఆ దేశంలో ఉన్న ఆదరణా, వారి సంక్షేమానికి వారు చూపుతున్న ప్రాధాన్యతా ఈ పర్యటనలో నాకు స్పష్టమయింది.

గీతాంజలి సంస్థ సాహిత్య గోష్ఠి :

బర్మింగ్‌హాంలో "గీతాంజలి మల్టీ లింగ్వల్ లిటరరీ సర్కిల్" అని డా॥ కృష్ణకుమార్, వారి శ్రీమతి చిత్రాకుమార్ 1995లో "గీతాంజలి" అనే బాలకవయిత్రి కేన్సర్ వ్యాధితో మరణించగా ఆమె పేర ఈ సంస్థను ఏర్పరిచారు. భారతీయ భాషా కవులతో సాన్నిహిత్యం పెంచుకుని జాతీయ సమైక్యతకు ఈ సంస్థ దోహదపడుతున్నది. విశ్వహిందీ సమ్మేళనానికి ఈ సంస్థ ఎంతో సహకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఆహ్వానించి, సాహిత్య గోష్టిని ఏర్పాటు చేశారు. డా॥ కృష్ణకుమార్, బర్మింగ్‌హాంలో వున్న పలువురు భారతీయ సాహితీ ప్రియలు ఈ సమావేశానికి విచ్చేశారు. సాహిత్యాంశాల విూద జరిగిన చర్చలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. లండన్‌లో ఎన్ని మహత్తర కట్టడాలను చూసినా, ఇంగ్లండ్‌లో మన తెలుగు వైభవ చిహ్నాల విూదే నా మనసంతా కేంద్రీకృతమై ఉంది. ఆ విశేషాలను మన తెలుగువారు తెలుసుకోవాలని, తెలుగు వైభవ ప్రభావాలకు దోహదపడాలనీ ఆకాంక్షిస్తున్నాను.

★★★