పుట:రేఫఱకారనిర్ణయము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

436

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక


క.

తఱిమి యని నేసె ననఁగాఁ, దఱియం జాఱు మనఁగఁ దలలు దఱగెద రనఁగాఁ
దొఱయుట తీఱఁగఁ దఱఁకినఁ, దఱలక యనఁ బెద్దఱాలు తథ్యము కృష్ణా.

28


క.

తెఱగొప్పఁ గన్ను దెఱవఁగఁ, దెఱ గన్నన దూఱె ననఁగఁ దీఱుదు రనఁగాఁ
దొఱులిడెఁ దీఱుగఁ జేయుము, తఱగని కింకనఁగ ఱాలుతలకొనఁ గృష్ణా.

27


క.

దఱకె నన వెలితి యగుముం, దఱ యన నొకకాల వాచి తన యెదుఱను ముం
దఱ యనఁబడు నొకచో నం, దొఱు ననఁగాఁ బెద్దఱాలు తూకొనెఁ గృష్ణా.

28


క.

ఇందఱ మిద్దఱు చెదఱుట, యెందఱు కొందఱు ననంగ నే దిఱ యనఁగా
నందఱు పెద్దఱికం బన, నిందఱు నన ఱాలు పుడమి నేర్పడెఁ గృష్ణా.

29


క.

నెఱి నెఱయ నెఱసి నఱికిన, నెఱి దప్పం బడియె ననఁగ నెఱమంటలు నా
నిఱి గొనియె ననఁగ నిండుట, నెఱివెండ్రుక లనఁగ ఱాలు నెలకొనె గృష్ణా.

30


క.

నెఱకులె యమ్ములు నఱుమై, నుఱుముగ నఱుమాడె నంత నుఱుమాడె ననన్
నెఱుపనలము నెఱుపాఱిన, నెఱుపఱి సింగ మన ఱాలు నెలకొనెఁ గృష్ణా.

31


క.

నూఱుపదు లనఁగ నెఱుసన, నీఱు పయిం గవిసి యున్న నిప్పు లనంగా
నూఱుచు నున్నాఁడనఁగా, నాఱు విడిచి యనఁగ ఱాలు నయముగఁ గృష్ణా.

32


క.

నెఱి లేనిసఖుం డె మ్మెలు, నెఱపఁగ నెఱనారసంబు నీఱుగఁ జేయన్
నెఱవుగ నెఱ నాఁటించిన, నిఱు పేద యనంగ ఱాలు నెలకొనెఁ గృష్ణా.

33


క.

నెఱి చెడక నెఱిక గట్టుట, నెఱవాదులు నఱువు దుడిచి నెఱి మొగ మనఁగా
నెఱ ద్రోవ యనఁగ నఱుఁజన, నెఱ బిరు దనఁ బెద్దఱాల నెలవులు కృష్ణా.

34


క.

పఱచె నన వేగఁ బోవుట, పఱపెదఁ బఱపితి ననంగ బడిఁదోలు టగున్
పిఱుసనుట వెనుకదీయుట, పఱచినపా ట్లనఁగ ఱాలు పనుపడెఁ గృష్ణా.

35


క.

పిఱికి తనంబడు.....నం, పఱ కోపక పఱియ లగుచుఁ బఱిమార్చె ననన్
పఱికొనుట ముంచి కొనుటగుఁ, బిఱుదన చొచ్చె నన ఱాలు పెంపగుఁ గృష్ణా.

36


క.

పెఱమూకలు పెఱచేతను, బఱిపఱియలు సేయు టనఁగఁ బఱివోయె ననం
బఱవఁగనోపక తొడిఁబడఁ, బిఱివోయె ననంగ ఱాలు పెనగొనెఁ గృష్ణా.

37


క.

పెఱిగినచందము చూపఱ, బిఱిదికిఁ బాఱెడుననంగఁ బిఱుదు లనంగన్
పెఱుకలు చిక్కులు వఱుపఁగఁ, బఱపకు పఱచు టన ఱాలు పాల్పడెఁ గృష్ణా.

38


క.

పాఱించు నాజి నెడతెగఁ, బాఱుట జలమెల్ల నింకఁ బాఱుట యనఁగాఁ
బాఱుఁ డనంగను విప్రుఁడు, పేఱిన వలు వనఁగ ఱాలు పేర్పడెఁ గృష్ణా.

39


క.

పెఱికితిఁ గొండలు పెంపఱఁ, బొఱ యన గఱుపాఱె ననఁగఁ బొఱతెగె ననఁ దె
ప్పిఱి యేదు వెఱిగిన ట్లనఁ, బిఱివెం డననంగ ఱాలు పెంపగుఁ గృష్ణా.

40