పుట:రేఫఱకారనిర్ణయము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేఫఱకారనిర్ణయము

437


క.

పఱవఁగ ననఁ బ్రవహించుట, పఱవుపయిం బాట్లఁ బఱచి పఱిపఱియలు గాఁ
బఱతెంచి తొల్లి తొప్పఱ, పుఱియలు పొఱకలును ఱాలపోడిమి కృష్ణా.

41


క.

బిఱువోవుచుఁ గదనంబున, బిఱబిఱ గద ద్రిప్పి వైవఁ బేర్కొని యది ద
బ్బఱ యనుచుఁ బట్టి యీడ్చెను, బఱబఱఁగా ననఁగ ఱాల పగుదులు కృష్ణా.

42


క.

మఱచిన మజవక మఱియును, మెఱయునెడన్ మెఱసి మఱపు మిఱుమిట్లుగొనన్
మెఱుములు మీఱఁగ మీఱియు, మెఱుఁగులె కాంతు లన ఱాలు మించెను గృష్ణా.

43


క.

ముఱిముఱి చీఁకటి గ్రమ్మఱి, మఱుఁగున విహరించి మఱఁది మాఱుమొగము ప
ల్మఱు మాఱిమసఁగి యేమఱి, మఱవరె మఱి యనఁగ ఱాలు మహిలోఁ గృష్ణా.

44


క.

మెఱుఁగును మేఘము మఱతురు, మఱుచునొకో మొఱకి యింకమాఱట నోళ్లన్
మెఱుఁగెక్కి మెఱుచు దిక్కులు, మఱతును నే ననఁగ ఱాలు మానుగఁ గృష్ణా.

45


క.

మా ఱేడగు నాతఁడు వే, మాఱును గునియంగ నేల మచ్చిక తోడన్
మాఱలుగక చేకొను ము, మ్మాఱును బలికినను ఱాలు మానుగఁ గృష్ణా.

46


క.

మెఱములు వైచుచు మెఱసియు, మొఱుఁగుచు ముఱుమొండె మనఁగ మొఱలిడి రనఁగా
మఱువు లనమాటు పెడ మఱి, మొఱపఁదనం బనఁగ ఱాలు మునుకొనెఁ గృష్ణా.

47


క.

మఱ లేక పెక్కు మాఱులు, మఱునాఁ డన మాఱుపడుట మైమఱువు లనన్
మిఱుఁజూపులు మా ఱేయఁగ, మఱఁద లనం బెద్దఱాలు మహిలోఁ గృష్ణా.

48


క.

వఱలఁగ ననుటయ వేడుక, వెఱవఱ వెఱచఱవ విల్లు విఱుగఁగ ననిఁ దా
వెఱగువడి విఱిచి విఱుగుట, వెఱమృగము లనంగ ఱాలు వెలసెను గృష్ణా.

49


క.

వఱడులు గూసెను వేఱొక, నఱతం ద్రోవంగ వెఱచి వఱలివెఱుఁగుతో
విఱిగాలియు వీఁఱిడి ని, వ్వెఱపా టదె యనఁగ ఱాలు వినఁదగుఁ గృష్ణా.

50


క.

సుఱ సుఱ యని యెడిచోటను, సొఱసొచ్చుట యనుట ఱాలు చొప్పడె నిటపై
మఱి కలిగెనేని తెలియుఁడు, తఱచెందును లేవు కృతులఁ దలఁపఁగఁ గృష్ణా.

51


ఆ.

ఱట్టు ఱవికె ఱంకు ఱాయి ఱిక్కించుట, ఱేపు ఱేవు ఱేను ఱేసి ఱెక్క
ఱేఁడు ఱెప్ప మూసి ఱివ్వన నది దాఁటి, ఱాచుఁ డనఁగఁ బెద్దఱాలు కృష్ణా.

52


గీ.

క్షీరనీర విభేదంబు చేసినట్లు, ధరణి రేఫఱకారముల్ తాళ్లపాక
తిరుమలార్యుండు వేర్వేఱఁ దేటపఱిచె, నుచిత మిది గాదె పరమహంసోత్తమునకు.

శ్రీకృష్ణార్పణమస్తు.

[యథామూలముగా ముద్రింపఁబడినది. ఈ నిర్ణయమునకు నిప్పటివ్యవహారమునకును బలుచోట్ల భేదము గలదు.]