పుట:రేఫఱకారనిర్ణయము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

434

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక


క.

మోహరము చొచ్చి యెడనెడ, నోహరి గా మలసి మలసి యొక్కొక్క దెసన్
సాహరిగొన నుప్పొంగెడి, బేహారు లనంగ రేఫ పెంపగుఁ గృష్ణా.

54


క.

పుట్టిరి తిట్టిరి కూలిరి, నెట్టన భూపాలు రనఁగ నెయ్యురు లేరే
గట్టిగ గండరు లెప్పము, నెట్టనఁ బోటరియు రేఫ నెలవులు కృష్ణా.

55


పెద్దఱాలు

క.

అఱవఱలై యఱకట ను, క్కఱ యఱిముఱి యఱచు ననఁగ నఱువుడు జోళ్లే
పఱయఱు మెడలక పాల్పడి, యఱువది గొట్లనఁగ జాల నమరెను గృష్ణా.

1


క.

అఱపొఱఁడు గుజ్జు రూపఱ, నఱపులు బిట్టఱ యనంగ నఱచితి కింగా
దఱుగుడుఁ గుబుసము సిగ్గఱి, యఱుముట యన ఱాల యోజ లనిశము కృష్ణా.

2


క.

అఱ లేనివాని కఱుగును, అఱకాలం దన్నుఁ దన్ని యఱుకమ్ముట నా
నఱ గొఱ లేక యనఁగఁ బెం, బఱ యనఁగాఁ బెగ్గఱాలయనువులు కృష్ణా.

3


క.

ఆఱడి యన నడలాఱఁగ, నాఱంపులు నాఱుచవులు నాఱనితేజం
బాఱమ్ములఁ బాపములో, టాఱె ననఁగ ఱాలు కృతుల నమరెను గృష్ణా.

4


క.

ఇఱికొని యిఱులు కొనఁగా, నిఱికిట మిఱు చన్నుఁగవయు నిఱమి యనం గ్రి
క్కిఱియఁ గ నిఱిసిన కడియుట, యిఱికిన ఱాగళులె ఱాలయిరవులు కృష్ణా.

5


క.

ఉఱవుగ సేనలమీఁదట, నుఱుకుడుఁ బడ మూఱి మెట్టి యుఱుముచు నేన
ట్లుఱక పగవారి నటుచి, చ్చుఱికింతు ననంగ ఱాలయునుకులు కృష్ణా.

6


క.

ఉఱఁడనఁ గైకొనఁ డను నది, యుఱున ట్టేవంబె యీగి యూఱడిలంగా
నుఱిడన నిలుకడ యూఱిన, నుఱుగడ యనఱాలుకృతుల కొదగెను గృష్ణా!

7


క.

ఎఱచి యన మాంస మేఱులు, నెఱగుట వందనము దిగుట యెఱ మం టనఁగా
నెఱుకు తల యెఱువ నెఱకలు, నెఱిఁగినయెఱుక లన ఱాలయిక్కువ కృష్ణా.

8


క.

ఒఱవ శరీరము మన్మథు, నొఱుపుల నొఱిగాల నుండి యొఱగె ననంగా
నొఱపు గలకత్తి యొఱలో, నొఱలుచు ననఁ బెద్దఱాలయోజలు కృష్ణా.

9


వ.

కవర్గువు.


క.

కఱపె ననఁగ నేర్చుట య, క్కఱపడి క్రిక్కిఱిసి వేడ్క కాఱులు వెస ను
క్కఱపడి కుఱుకుల్ గట్టుక, కఱతల కలికి యన ఱాలు కనుగొనఁ గృష్ణా.

10


క.

కఱపించుఁ గఱచుఁ బండ్లను, గఱపెడి ననఁ గఱచు ననఁగఁ గల వవి నేర్పుల్
కఱదులు బుద్దులు కుఱుకొని, కుఱుగలి కొను ననఁగ ఱాలు గొనకొనెఁ గృష్ణా.

11