పుట:రేఫఱకారనిర్ణయము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేఫఱకారనిర్ణయము

433


క.

పేరిననేతికినై కడుఁ, బోరాటము లేల వలదు పోరా యనినన్
పోరం బెనఁగకు మింకను, బోరామి యొనర్పు రేఫ పొలు పగుఁ గృష్ణా.

39


క.

బూరటిల బారిసమరెన్, బోరగిలం బరవసంబు బోరని మ్రోసెన్
బారిఁబడ బెరసి బరిమెయి, బీరము నిబ్బరము రేఫఁ బేర్పడెఁ గృష్ణా.

40


క.

బురజ లనంగా గజ్జెలు, బిరుదులు పాదములఁ గట్టి పెట్టఁగవలె నా
బురబురఁ బొంగినచల్లలు, బరు లుబ్బఁగఁ ద్రాగు రేఫ పనుపడెఁ గృష్ణా.

41


క.

మురిసెం దొండము దంతికి, మరలుట మరిగించి కొనుట మది మెరతొర సు
మ్ముర మెరపరాళ్లు తేంటులు, మొరసె ననన్ రేఫ లయ్యె మురహర కృష్ణా.

42


క.

మేరలు దప్పిన శత్రుల, మారిమసంగుటలు మొరడు మరియాద యగున్
మీరలు దెండా యీమరి, మారేళ్లన రేఫ లయ్యె మాధవ కృష్ణా.

43


క.

మురియ లనంగాఁ దునియలు, మిరియము లని పల్కుచోట మెలఁతల మనముల్
మరుపఁగవలె ననఁగాఁ దా, మర లనఁగా రేఫ లయ్యె మహిలోఁ గృష్ణా.

44


క.

మురిపెముతో నిలిచెను గ్ర, మ్మర మారట విగ్రహంబు మది వేమారున్
మురముర యనియెడి కోపపు, మరు లుడుపుట రేఫ లయ్యె మానుగఁ గృష్ణా.

45


క.

రూపించి రేయు రచ్చయు, రూపును రమ్మనుట రచ్చ రోయక రెండున్
రూపును రాలుట రంకెలు, నీపగిదిన్ రేఫ లయ్యె నెన్నఁగఁ గృష్ణా.

46


క.

రాయంచ రిత్త రక్కసి, రాయుచు రాయుటయు రాడు రాచూలి యనన్
రేయెండ రేకు రూడియు, రాయిడి రుచి యనఁగ రేఫరచనలు కృష్ణా.

47


క.

రారు రమణ నటు రోఁజుచు, రారా రాగిల్లి రమ్ము రాసి యొకటనే
నేరా మాటలు వినరా, యీరీతుల రేఫ లయ్యె నెన్నఁగఁ గృష్ణా.

48


క.

వారించుట యెవ్వరికిన్, వారికి వారకము విరులు వారక యొసఁగన్
వారువములు పల్వురకును, వీరనఁగా రేఫ లయ్యె వెలయఁగఁ గృష్ణా.

49


క.

వరటము వరువు ళ్లేవురు, విరియుట యున్ వరుస వెరవు విరవిర మనఁ గా
ల్వురు నవ్వరె యప్పురి గొన, వెరవిఁడియన రేఫ లయ్యె వెలయఁగఁ గృష్ణా.

50


క.

వారకుల నెక్కి యార్వురు, వేరము తలవరులు వెరసు విరియం జల్లెన్
వారని వోవరి దేవర, వారాశి యనంగ రేఫ వరుసలు కృష్ణా.

51


క.

శరబడి సేసిరి సైరణ, సురిగితి రన సరియ నంగ సూరె లనంగన్
సిరియనఁగ లక్ష్మి చేసిరి, సరకు లనన్ రేఫ లయ్యె సతతము కృష్ణా.

52


క.

సురియలు సోరణగండ్లును, సొరిదిన్ వేసరుల నెక్కి సొరటా సారెల్
సరకేమియుఁ జేయకు మన, సరు లనఁగా రేఫ లయ్యె సతతముఁ గృష్ణా.

53