పుట:రేఫఱకారనిర్ణయము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

432

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక


క.

చిరుఁగని చీరలతో వ, చ్చిరి యచ్చర లనఁగ జరగి జీరలఁ దగని
చ్చిరి చేరుపు టనఁ జేర్చుట, చొరువనఁగా రేఫ లయ్యె సొంపుగఁ గృష్ణా.

25


క.

తరిచాడె తరువ తరమిడి, తిరుగుట తిరియుటయుఁ దిరము తెరలుట తెరువున్
దరలఁగఁ దరతరమును మా, ర్తురు నెత్తురు రేఫ లయ్యె రూఢిగఁ గృష్ణా.

26


క.

తోరంబు తెరయుఁ దొరుగుట, తేరా భూషణము లనఁగఁ దెకతేరయు నే
తేరఁగ నేర్తురు తారును, దేరెక్కు మనంగ రేఫ తెలియఁగఁ గృష్ణా.

27


క.

తర మెంచక చనుదెంతురు, తొరలినఁ బలుతెరఁగు లందుఁ దూరుపుదెస వ
త్తురు తీరని కోపముతోఁ, దరఁగ లనఁగ రేఫ లయ్య! తప్పవు కృష్ణా.

28


క.

తెరలంగాఁగిననెయి క, స్తురివంటిది మంచి దనఁగఁ దొలితొలి కడుఁ జి
త్తరు వ్రాయఁగ నుద్యోగిం, తురు వేడ్క ననంగ రేఫ దూకొనెఁ గృష్ణా.

29


క.

దరికొని కుదురుగఁ జూదరి, దొర దొరకో ల్దురము నెదురు దురపిల్లుట యున్
దొరయఁడు సరిగాఁ డనునది, దరిఁదొక్కుట రేఫ లయ్య తలఁపఁగఁ గృష్ణా.

30


క.

దొరకొన్నయపుడె చెంతకు, దొరకొల్పుట మే లనంగ దూరులు వల్కన్
దురదుర నేల కడం గెదు, దొరసినచో రేఫ లయ్యెఁ దొడిఁబడఁ గృష్ణా.

31


క.

నేరిమి సరములు నరలును, నారలు నోరెత్తి నీరు నారసమును గ
న్నారము నెరయఁగఁ జల్లుఁడు, నేరక నుకువు లన రేఫ నిక్కము కృష్ణా.

32


క.

నేరేడు పండ్లు నెరసులు, నేరుపుతో వింటినారి నిగిడింపుచు ను
న్నా రహితులు కదనంబున, నీరై రని పల్క రేఫ నెలవులు కృష్ణా.

33


క.

పరఁగఁ బరికింపఁ బరువడి, పురు డీ డగు సూతకంటు పురు డగుఁ బరిమా
ర్చిరి డెప్పర మిప్పరుసనఁ, బొరయక యన రేఫలయ్యెఁ బొలుపుగఁ గృష్ణా.

34


క.

పొరిఁబొరిఁ బరుసనఁ బొరిగొని, పురఁబురఁ బొక్కంగఁ బెరుగు పొంపిరివోవన్
బెరుగుట వర్ధిల్లుట యగుఁ, బొరు గన నివి రేఫ లయ్యెఁ బొందుగఁ గృష్ణా.

35


క.

పరిగొని పరిచనుదెంచుట, పరువము పెనుపరియు నేరుపరి పురిగొలుపన్
బొరిపొచ్చెముఁ జప్పరమును, బొరలితి మన రేఫ లయ్య పొందుగఁ గృష్ణా.

36


క.

పోరితము పోరు పిరిగొనఁ, బే రన నామంబు తేనెపెర పేరురమున్
బేరడి పరపుట నించుట, పోరచి యన రేఫ లయ్యెఁ బొలుపుగఁ గృష్ణా.

37


క.

పరువుగలచోటఁ బరువులు, పరుసములును బెరడు బద్దపరి పరిగోలల్
పరఁగించిరి పొరిఁగలుగఁగఁ, బరిసరవర్తు లన రేఫ పాల్పడెఁ గృష్ణా.

38