పుట:రేఫఱకారనిర్ణయము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేఫఱకారనిర్ణయము

431


క.

ఉరులొడ్డి యురులఁద్రోయుట, యురవడితో నురవణించు టొత్తుట డెందం
బురియఁగ నురియాడుట యన, నురులింప ననంగ రేఫ లొనరెను గృష్ణా.

11


క.

ఊరకయుండుట యనఁగా, నూరార్చుట యనఁగ దుఃఖ ముడుపుట భువిలో
నూ రనఁగ గ్రామనామం, బూరటవుచ్చుకొన రేఫ లొక్కటఁ గృష్ణా.

12


క.

ఎరుగలి చిచ్చున నెరియఁగ, నెరగా నాహార మనఁగ నేరికిఁ జిత్తం
బెరియఁగ నన నెర వి మ్మన, నెరవనఁగా లాఁతిరేఫ లెన్నఁగఁ గృష్ణా.

13


క.

ఒరు లోరసేసి రన మి, న్నొరయంగా నోరలేక యోరీ యౌరా
యొరసిన దైత్యుఁడు వడె నొం, డొరు లనఁగా రేఫల య్యె నున్నతిఁ గృష్ణా.

14


క.

కర మిష్టము కరణియనం, గరువునఁ బోసిరి యనంగఁ గరఁగి రనంగాఁ
గరిసెన మనఁ గృషియగు నొ, క్కరుఁడన నివి రేఫ లగుచుఁ గనఁబడెఁ గృష్ణా.

15


క.

కో రప్పన మనఁగాఁ జే, కూరుటయనఁ దక్కి రనఁగఁ గోరుట యనఁగాఁ
గూరిమి యనఁగా నతనికి, గూరుతు నన రేఫ లయ్యె గుణనిధి కృష్ణా.

16


క.

కో రనఁగ గిన్నె యమ్ములు, కూరంగా నాటె ననఁగఁ గురిసెను వానల్
కారింప ననుట నొంచుట, కారాకులు రేఫ లగుచుఁ గనఁబడుఁ గృష్ణా.

17


క.

కారుకొనె మొగులు శత్రులు, గా రనఁగాఁ దాఁకి రనఁగఁ గరువలి యనఁగాఁ
గారులు కల్లలు కర్జము, కారియ మన రేఫ లయ్యెఁ గలయగఁ గృష్ణా.

18


క.

కరికరిఁ గరమొప్పఁగఁ దొ, ల్కరివాన లనంగఁ గెరలి కరకరఁ గాలన్
గరవాఁడియమ్ము లేసిన, గొరప్రాణము లనఁగ రేఫ గుణములు కృష్ణా.

19


క.

కూరలు గాయ లనంగాఁ, గారాటము తోడ నొకరిఁ గరిఁ గోరి రనన్
కూరుకుట నిద్రపోవుట, కూరుట పొగులుటలు రేఫ కులములు కృష్ణా.

20


క.

గారవము గలిగె గరువము, గారా మన మ్రగ్గి రనఁగ గరునడి యన బం
గారము గురుగులు గరితలు, గోరది యన రేఫ లయ్యె గుణనిధి కృష్ణా.

21


క.

గురువు లన గతివిశేషము, గరుత్రాల్చెను మే ననంగఁ గడఁగి రనంగా
గరువన గర్భము ఘనతయ, గరువతనము రేఫ లగుచుఁ గడఁగెను గృష్ణా.

22


క.

గురుసులఁ గూడంగా వే, గిరపడి జేగురున గోర గిరగిర వ్రాయన్
గరుసులు దాఁటఁగఁ దాఁకిన, గరు సింగార మన రేఫగతు లివి కృష్ణా.

23


క.

చేరువఁ దెచ్చిరి చెచ్చెరఁ, జేరిరి యచ్చెరువు చొరగఁ జెరువుట చీరల్
చీరికిఁగొన కచ్చిరియము, చూరే యన రేఫలయ్యె సొంపుగఁ గృష్ణా.

24