పుట:రేఫఱకారనిర్ణయము.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుభమస్తు
శ్రీమతేరామానుజాయనమః

రేఫఱకారనిర్ణయము

[తాళ్లపాక అన్నమాచార్యులకుమారుండు తిరుమలయ్యంగారు కవిత్రయము మొదలైన పూర్వకవీశ్వరుల ప్రబంధాలలోని రేఫఱకారా లేర్పఱచి లక్షణగ్రంథముగా నానతిచ్చిన రేఫఱకారారపద్యాలు.]


క.

శ్రీ వేంకటేశ నీకుం, గావించెద నంకితంబుగా ఱారేఫల్
వావిరి నేర్పఱచినకృతి, శ్రీవనితానాథ రామ చేకొనుకృష్ణా!

1


క.

అచ్చులు హల్లులు వరుసన, వచ్చిన రేఫలును ఱాలు వర్ణించెద మున్
మెచ్చుగ నాదికవీశ్వరు, లచ్చుపడం గృతులఁ జెప్పినటువలెఁ గృష్ణా.

2


క.

ఇచ్చిరి తెచ్చిరి యనియెడి, యచ్చతెలుంగులఁ గ్రియాపదాంతంబులపై
వచ్చినవి యెల్ల రేఫలు, ఱచ్చల................................రచనలు కృష్ణా.

3


క.

ఇల ఘోషాక్షరములపైఁ, గలుగవు తెలుఁగునను ఱాలు కడఁగును రేఫల్
తలఁపఁగ సంస్కృతపదముల, గలిగినవియు రేఫ లగును గనుఁగొనఁ గృష్ణా.

4


క.

ఎఱుక యిర వనుట మొదలగు, మొఱసెడి యెత్వములు నిత్వములు తెలుఁగున నేఁ
ర్పఱచినవి యెల్ల నచ్చులు, పెఱిఁగి యకారములు గావు పెంపుగఁ గృష్ణా.

5


క.

అరి యనఁగ నప్పనం బగు,...............................గ న్ననఁగా
నరిది యరవాయిగొనక, ట్లరగవి యన వెలితిరేఫ లనఁదగుఁ గృష్ణా.

6


క.

ఆరసి చల్లారఁగఁ గ, న్నారఁగ నా రెండు ననఁగ నారఁగ ధర్మం
బారంగాఁగినపా లన, నారంగూరె నన రేఫ లయ్యెను గృష్ణా.

7


క.

ఆరెకులనఁగాఁ దలవరు, లారాటము నారటంబు నారయ నట పొం
గారెడు నారని యనలం, బారంగా ననఁగ రేఫ లయ్యెను గృష్ణా.

8


క.

ఇర యనఁగ నెలవు చెప్పుట, యిరువురు నిరువది యని రవు నిరవారంగా
నిరుఁగెలఁకుల నొల్లం బో, యిరి యనఁగా రేఫ లయ్యె నయ్యెడఁ గృష్ణా.

9


క.

ఈరికెలొత్తె మనంబున, నీరస మీరెలుఁగు దాన మీరి యనంగా
నీరనఁగ మిమ్ముఁ జెప్పుట, యీరేడన రేఫ లయ్యె నెన్నఁగఁ గృష్ణా.

10