Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 47

లనవలెను. రామునికిని కృష్ణునికిని మధ్య ఇంచుమించు 800 సంవత్సర ములు గతించియుండును. సిచు. వైద్యాగారు రామాయణ విమర్శనమును గురించి వ్రాసిరి. ఆంగ్ల గ్రంథములో ఇట్లు వ్రాసినారు: "అభ్యంకరు గారు, విష్ణుపురాణమఁదలి వంశావళులను లెక్కించి రామునికిని కృష్ణునికిని మధ్య 36 గురు రాజులు గతించిరని వ్రాసినారను దానిని బట్టి ఉభయులకు మధ్య 980 సంవత్సరాలైనను ఆంతరాయము ఉండెనని అత డభిప్రాయపడినాడు.”

ఇంతకుముందు చూపిన ఇంద్రపూజా ప్రాముఖ్యమును గురించి రామాయణమందు చాలా నిదర్శనములు కలవు. అగస్త్యాశ్రమములో ఒక్కొక్క వైదిక దేవతకు ఒక్కొక్క పూజావేదిక యుండెను. బ్రహ్మ, అగ్ని, విష్ణు, ఇంద్ర, సూర్య, చంద్ర, భగ, కుబేర, ధాతృ, విధాతృ, వాయు, నాగరాజ, అనంత, గాయత్రీ, వసు, వరుణ, కార్తికేయ, ధర్మ, దేవతలకు వేదికాస్థానములుండెను. (అరణ్య-12 సర్గ -17 నుండి 20 శ్లో. వఱకు)

ఇందు విష్ణు, అనంత, నాగ, కార్తికేయ, ధర్మ అను పౌరాణిక దేవతలుకూడా చేరినారు. అయినను వైదిక దేవతా ప్రాముఖ్యము చాలా వ్యక్తమగుచున్నది.

సాలమన్ కాలములో ద్రావిడ దేశమునుండి నెమిళ్ళు, కోతులు, చందనము మున్నగునవి యెగుమతి యగుచుండెనని తెలిపినాను. నెమిలిని "తుకి” అని తమిళములో అందురనియు ఆ పదమునే హిబ్రూవారు వాడిరనియు ఇతర దక్షిణభారతీయవస్తువులకును అట్టి తమిళ నామములనే వాడిరనియు పరిశోధకులు నిరూపించినారు. సాలమన్ క్రీ. పూ. 1000 ప్రాంతపు హీబ్రూరాజు. అట్టి కాలములో దక్షిణాపథము మహానాగరిక దేశమై యుండుటయు సముద్రప్రయాణమును మధ్యధరా