Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 రామాయణ విశేషములు


(5) సుగ్రీవుడు -- సహదేవుని దిగ్విజయములో చున్నాడు. * కనబడు

ఈ విధముగాచూచిన రాముడు శ్రీకృష్ణునికన్న 50 ఏండ్లు లేక 70 ఏండ్లకు పూర్వుడై యుండియుండును. కాని రామాయణములోని దేశకాల భౌగోళిక పరిస్థితులను బట్టి యాలోచించిన ఈ నిర్ణయమును రాముడు వింధ్యను సమీపించగా అచ్చటి నిరాకరించవలసియుండును. నుండి దేశమంతయు అరణ్యముగాను, నిర్జన ప్రదేశముగాను అందందు ఆటవికులతో గూడినదియునై యుండెను. వింధ్యాద్రి దక్షిణ ప్రాంతాన్ని దండకారణ్యమనిరి, దండుడు లేక దాండక్యుడు భార్గవుని బిడ్డను బలవంతముగా ఎత్తుకొనిపోయెననియు భార్గవునిశాపముచే అతని దేశమంతయు పాడుపడి పోయెననియు రామాయణమందే వ్రాసినారు. ఈ యంశమునే పురస్కరించుకొని చాణక్యుడును, వాత్స్యాయనుడును ఇట్లు వ్రాసిరి: సూ॥ యథా దాండక్యోనామ భోజః, కామాత్ బ్రాహ్మణక న్యా మభిగమ్యమానః సబన్ధురాష్ట్రా విననాశ.

పై యంశాన్ని బట్టి దాండక్యుడు భార్గవుని సమకాలికుడని స్పష్ట మగుచున్నది. రాముని కాలములో ఇంచుమించు ఆర్యులకు ప్రవేశములేని దండకారణ్యము శ్రీకృష్ణుని కాలములో రాజ్యాలతోను అభివృద్ధినొందిన ప్రాంతాలతోను నిండినట్లు మహాభారతమునుండి విశదమగుచున్నది. కావున సుగ్రీవ, హనుమంత, పరశురామ, విభీషణాదుల చిరంజీవితమును భారతకాలములో కూడ వా రుండిరను విషయమును ప్రక్షి ప్తము

  • హిందువుల పండుగలు, పుటలు 193-196
    • రామాయణము, ఉత్తరకాండము, 80-91 సర్గలు.