Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 రామాయణ విశేషములు

సముద్రమువరకు ఓడలలో సాగించుటయు మనదేశమందు సిద్ధముచేసిన వస్తువులను అక్కడ అమ్ము చుండిరనిన దాండక్యుని కాలములోని నిర్జనా రణ్యమింతటి నాగరకస్థితికి రావలెననిన ఎన్నియో శతాబ్దములు పట్టి యుండును. కావున సాలమన్ కాలానికి 1000 లేక 1500 ఏండ్లముందు ఈ దక్షిణాపథము నిర్జనారణ్యమై యుండియుండును.

ఋగ్వేదములో రాముడు

శ్రీ పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ “రామోపా ఖ్యానము.....తద్విమర్శనము" అను గ్రంథపీఠికలో నిట్లు వ్రాసినారు:

"రామ రావణుల యస్తిత్వము కల్పితముకాక సత్యమే యనుటకు ఋగ్వేదమున నీక్రిందిరీతిని సూచింపబడియుండెను.

“ప్రతద్దుశ్శీమే పృథవానే వేనౌ రామే చ మసురే మఘ యే యుక్త్వాయ పంచ శతాస్మయుపధా విశ్రామ్యేషాం” వత్సు ఋగ్వేదము 10_93_14

అనగా "ఏ దేవత లైదువందల రథముల నశ్వములతో గూర్చు కొని మాయందు ప్రేమగలవారై యజ్ఞమార్గముచే వచ్చుచున్నారో ఆస్తోత్రము, పృథవానునియందును, వేనుని యందును, అసురుడు బలవంతుడగుచుండగా రామునియందును, ధనవంతులయందును జెప్పు చున్నాము.”

శాస్త్రిగారిచ్చిన యర్థము బోధయగుటలేదు. బలవంతుడగు అసురుడంటే రావణుడనియు అతని వధను రాముడు చేసెనను సూచన పై మంత్రములో నున్నదని శ్రీ శాస్త్రిగారి యభిప్రాయమై యున్నది.