Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

23

యతనికి పట్టము కట్టెను. ఇతనికి మహారాక్షసుడు, అతనికి దేవరాక్షసుడు, అతనికి కీర్తిధవళుుడును, అతనికి తటిత్కేశుడును బుట్టిరి.

ఇక వానరోత్పత్తి యెట్లనగా రత్నపురమున తొల్లి పుష్పోత్తరుడను విద్యాధరుడు రాజ్యము చేయుచుండెను. అతనికి పద్మో త్తరుడను కుమారుడును, పద్మయను కూతురును గలిగిరి. శ్రీకంఠుడను రాజు పద్మను వివాహమాడదలచి తన విమానముపై నెత్తుకొనిపోయెను. పుష్పో త్తరుడు కోపించి శ్రీకంఠుని చంప నుద్యుక్తుడయ్యెను. అప్పుడు పైన చెప్పబడిన కీర్తిధవళుడను రాక్షసుడు వారికి సంధి సమకూర్చెను. కొంతకాలమునకు శ్రీకంఠుడు వానరద్వీపమునకు రాజయ్యెను. ఇతనికి వజ్రకంఠుడు, అతనికి దశరథుడు పుట్టిరి.

పై జెప్పిన రాక్షసరాజుకు తటిత్కేళు డొకనాడు వానరద్వీప మందు భార్యాసహితుడై యిచ్ ఛావిహారముచేయుచుండ నతని భార్య యొక్క ముఖము నొక్క వానరుడు బరికి పెట్ట భర్త కోపించి వానిని జంపెను. పిమ్మట పశ్చాత్తపుడై వైరాగ్యమును బొంది తన కొమరుడగు సుకేశునికి బట్టము గట్టెను. అచ్చట వానరద్వీప రాజగు దశరథునకు కిష్కింధుడు పుట్టెను. ఇతనిని స్వయంవరమందు మందిరమాలియను రాజు కూతురు వరింపగా అశనివేగు రాజు కోపోద్దీపితుడై వానరద్వీప మును జయించి యచటినుండి కిష్కింధుని బారదోలి రాక్షసద్వీపముపై తన సైన్యమును నడుపగా సుకేశుడును పారిపోయెను. ఈ సుకేశుడును కిష్కింధుడును పాతాళ లంకలో దాగుకొనిరి. అచ్చట సుకేశునికి మాలి, సుమాలి, మాల్యవంతులను ముగ్గురు కుమారులు పుట్టిరి. మాలి పెద్ద వాడైన పిమ్మట తనతండ్రి కపచారముచేసిన రాజును, అతని రాజ్యమును జయింపగోరి బయలుదేరెను. కాని యతడు యుద్ధమందు మరణించెను. అతని తమ్ముడగు సుమాలి కేకసి యనుదాని బెండ్లియాడి రత్న శ్రవసుడు, భానుకర్ణుడు, విభీషణుడను కుమారులను చంద్రనఖ యను