Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

రామాయణ విశేషములు

కూతును కనెను. వీరి పూర్వికు డిచ్చిన నవరత్నముల హారము సుమాలిదగ్గఱనుండెను. దాని నెవ్వరు నెత్తజాలకుండిరి. దానిని వేయి సర్పములు కావలి కాచియుండెను. అట్టి వజ్రహారమును రత్నశ్రవసు డవలీలగా ధరించెను. ఆ నవరత్నములందీ బాలుని ముఖప్రతిబింబమును చూచి తండ్రి సంతసించి యతనికి "దశముఖ” యను బిరుద మిచ్చెను. భానుకర్ణునికి కుంభకర్ణుడని పేరువచ్చెను. మరియు చంద్రనఖకు శూర్పణఖ యను పేరు వచ్చెను.

దశముఖుడు పెద్దవాడై తపస్సుచేసి యనేక శక్తుల సంపాదించి మండోదరి యనుదాని బెండ్లియాడి యింద్రజిత్తను కొడుకును బడసెను.

రావణుని దిగ్విజయము 2

పిమ్మట లంకాపురమును సాధించి దానికధీశుడయ్యెను. వానర రాజైన కిష్కింధుని కుమారులగు ఆదిత్యరజస్సు, రక్షరజస్సు అను వారు నరకములో బడినారని విని యమరాజను పారదోలి వారిని వానర ద్వీపమందు రాజులనుగా జేసెను. ఆదిత్యరజస్సునకు ఇందువతివలన వాలి, సుగ్రీవులు పుట్టిరి. రక్షరజస్సునకు నలుడు, నీలుడు పుట్టిరి. వాలి కిష్కింధ నేలెను. దశముఖుడు లంక నేలుచుండెను. అతడు వాలి పరాక్రమము వినినవాడై యోర్వక యతనిపై యుద్ధమునకు బయలుదేరి యోడిపోయి బంధింపబడెను. పిమ్మట వాలి యతనిని విడిచిపెట్టి మేరు పర్వతముపై తపస్సు చేయబోయెను. సుగ్రీవుడు తన కూతురగు సుభద్రను దశముఖున కిచ్చి పెండ్లిచేసెను. దశముఖు డంతటితో నూరకుండక రత్నావళియను నందకత్తె సత్యలోకమున నున్నదని దానిని తెచ్చుకొనదలచి పోవుచు మార్గమధ్యమందు వాలిని జూచి మేరువు క్రింద చేయివెట్టి పర్వతముతోగూడ నతనిని గూల్పజూచెను. కాని వాలి తన బొటనవ్రేలితో పర్వతము నదుమగా క్రిందనుండిన దశముఖుడు పీడితుడై యనేక సంవత్సరములు రోదనముచేసెను. అందుచేత నితనికి రావణుడను