Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

15

బలవంతముగా ఆ పని చేయలేదు. హెలెనే వానివెంబడి పోయెను. అట్టి దానికై పదేండ్ల యుద్ధము జరిగెను అట్టి వ్యభిచారిణికై చాలామంది వీరులు చావగా హెలెనును మెనిలాసు ప్రేమతో తన యింటికి తెచ్చుకొని తృప్తిపడెను.

హోమరు యొక్క పాత్రల హైన్యత వ్యక్తమగుచున్నది. హెలెను ఎక్కడ? సీత ఎక్కడ? నక్క ఏడ? నాక లోక మేడ? హోమరు యొక్క ఇలియడులో రామునివంటి నాయకుడు ఎంత వెదికినను కానరాడు. ఇలియడు పురాణానికేమియు ఆదర్శము లేదు హిందువులు ఆదర్శ రహితమైన కథలను స్వీకరించినవారు కారు. పైగా హోమ రెప్పటివాడు ?

హోమరు కాలము

క్రీ. పూ. 685 నుండి క్రీ. పూ. 1159 సంవత్సరాలమధ్య హోమ రుండియుండవచ్చును అని విమర్శకు లూహలు చేసినారు. హెరెడోటస్ అను ప్రాచీన చారిత్రకుని అభిప్రాయ ప్రకారము హోమరు హెరెడోటసుకంటే 400 సంవత్సరములకు పూర్వ ముండినవాడు. అనగా క్రీ. పూ. 830 లో ఉండెను. అరిస్టార్కసు అభిప్రాయములో అతడు క్రీ. పూ. 1044 లో ఉండెనట. ఇదంతయు ఊహయే. హోమరు అను వాడే లేకుండెనని పలువురు పాశ్చాత్య పండితులు వ్రాసినారు. ట్రాయి యుద్ధము అనగా ఇలియడ్ కథ జరిగినకాలము క్రీ. పూ. 1200 ఏండ్లనాడు. హోమరు వ్రాసిన గ్రంథములో నీతిబాహ్యమైన విషయములు చాలా యుండినందున క్రీ.పూ. 150 లో ఇలియడును కొందరు పండితులు తీర్చిదిద్ది యిప్పటి రూపానికి తెచ్చి ప్రపంచాని కర్పించిరి. ప్లేటో అను గ్రీకు నై యాయికుడు ఇలియడు పురాణములోని అసభ్యతను గర్హించెను. జెనోడోటస్ కవి దానిలో చాలా మార్పులు చేసెను. అట్లు