196 రామాయణ విశేషములు ఈ సందర్భమును గమనించినచో రామాయణములో వసిష్ఠ విశ్వామిత్రులు మనము వినిన మానవాతీతశక్తులగు వారు కారనియు, వారి వంశములోని వారనియు, వారు రామాయణములో ముఖ్యస్థానములో నుండినవారు కారనియు విశదమగును. ఈ విధముగా రామాయణములో ప్రతి పాత్రకును ఒక వ్యక్తిత్వ మున్నది ముఖ్యమగు వ్యక్తుల గుణపోషణమును లోపము లేనట్లుగా వాల్మీకి పోషించినాడు. ఇట్టి పవిత్ర గ్రంథము, చదివిన కొలది ఆనంద మతిశయించుచుండును. రామాయణమందలి సహజ వర్ణనలు, సుందర భావములు, ఉత్తమ నీతివర్తనము, కేవలము హిందువులకే కాక ప్రపంచ మందలి ధార్మికాభిలాషు లందరికిని ఆదర్శప్రాయములు. ఇట్టి కావ్యము సంస్కృతమందే కాదు, ప్రపంచమందే భాషయందును నేటివరకునూ సృష్టికాలేదు. హిందువుల సంస్కృతిని, నాగరికతను, భావౌన్నత్యమును, ధార్మికోదా తతను, కవితాప్రాగల్భ్యమును, ప్రతిభాశక్తిని ఈ వాల్మీకి రామాయణమే సర్వకాలములందు, సర్వదేశములందును చాటుచు వచ్చినది. ఇకముందును చాటుచుండగలదు.
పుట:రామాయణ విశేషములు.pdf/246
Appearance