వాల్మీకి భూగోళము & పురాణములను పరిశోధించువారు రెండుమూడు విషయములను గమనించియుండవలెను ఈ కాలములో పట్టపరీక్షలకు సెలెక్షన్సు ఎటులో, నూరు సంవత్సరాల క్రిందట బాలశిక్ష తెనుగుబాలుర కెటులో, అటుల ప్రాచీనకాలమందు పురాణములు చదువను వ్రాయను నేర్చిన వారికి పనికివచ్చుచుండెను. వాటిలో రాజుల చరిత్ర, దేశాలచరిత్ర, కన్నంత విన్నంత ప్రపంచ భూగోళము అనగా ఏషియాఖండ భూగోళము, నీతిమతవిద్యలు (Ethics & religion), రాజశాస్త్రము (Politics), లలితకళలు (Fine arts), జ్యోతిషము, ధర్మశాస్త్రము చేరి యుండెను. అవి విజ్ఞానకోశములుగా సిద్ధమయ్యెను. కాలము మారేకొలది పురాణాలనుకూడా పెంచుతూ వచ్చిరి. ఆ పెంచుటలో తర్వాతి వారికి పూర్వుల భూగోళజ్ఞానము లేక పోయెను. సముద్రయాన మాగిపోయెను. హిందువులు ఇంటిపట్టు (insular) వారైరి. ఇతర దేశముల యొక్కయు, అందలి స్థలముల యొక్కయు, జనులయొక్కయు విశేషములను అర్థము చేసుకొనలేక శబ్దసామ్యముచేత కల్లలు కథలు పెంచి అడ్డదిడ్డిగా వ్రాసిరి. శబ్దసామ్యమువలన నేర్పడిన కల్పనలను ఈ ప్రకరణములో కొన్నింటిని చూపించినాను. రెండవ దేమనగా కులాలు బిగిసిపొయ్యేకొద్ది ఉచ్చనీచ తలను పురాణాలద్వారా ప్రచారము చేసిరి. పరమతములను దూషించిరి. ఈ విధముగా పురాణాలను దుర్వినియోగము చేసిరి. మరొక్క విషయమును గమనించవలెను. పురాణాలలోని నానా జాతులను యక్షరాక్షసకిన్నర గంధర్వాది జాతులను గురించి చదివి
పుట:రామాయణ విశేషములు.pdf/247
Appearance