Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 195 వంశములో చాలామంది విశ్వామిత్ర నామధేయులుండిరి. ఒక్కొక్కరు కొన్ని ఘనకార్యములను చేసిపోయిరి. అవన్నియు ఒకే వ్యక్తికి తర్వాతి పౌరాణికు లంటగట్టినారు. పర్గిటర్ గారిట్లు వ్రాసినారు: “విశ్వామిత్రులు ఇద్దరుండిరి. ఒకరు శునశ్శేఫుని రక్షించినవారు. ఇంకొకరు పాంచాల రాజైన సుదాసుని పురో హితులు. వీరిద్దరిని ఒకటిగా భావించి ఇద్దరి చర్యలను కలగలిపినారు . గాధికుమారుడైన వాడు మొదటి విశ్వామిత్రుడు. రామాయణములో విశ్వామిత్రుడు రెండవవాడు. వసిష్ఠునిచేత పరాభము పొందినవాడు మొదటి విశ్వామిత్రుడేకాని రాముని కాలములో నుండిన రెండవ విశ్వామిత్రుడు కాడు. అదేవిధముగా అనేక వసిష్ఠులుండిరి. వీ రందరును ఒకే వసిష్ఠునిగా పౌరాణికులు భావించిరి. అదేవిధముగా మార్కండే యులును బృహస్పతులును పలువురుండిరని ఎరుగవలెను.” పర్గిటర్ ఇంకను ఇట్లు వ్రాసినారు: “జనకులును అనేకు లుండిరి. సీరధ్వజ జనక, ధర్మ ధ్వజ జనక, దైవరాతి జనక, ఖాండిక్య జనక అనువారెందరో యుండిరి. హరిశ్చంద్ర, సగర, కల్మాషపాద, దశరథ రాజుల సంబంధములో పేర్కొనబడిన వసిష్ఠులు, వేర్వేరు వారని ఎరుగవలెను.‡” “పూర్వములో ఎనిమిది సుప్రసిద్ధ బ్రాహ్మణ మూలకుటుంబము లుండెను. భృగు, అంగిరస, మరీచి, అత్రి, వసిష్ఠ, పులస్త్య, పులహ, క్రతువంశములు. మొదటి అయిదు బ్రాహ్మణ వంశములుగానే నిలచెను. తక్కిన మూడింటి లోని పులస్త్యవంశములో రాక్షస, వానర, కిన్నర, యక్షులు పుట్టిరి. పులహవంశములో పిశాచాదులును క్రతువునకును వాలఖిల్యాదులును పుట్టిరి. రామాయణములోని వసిష్ఠుడు తన వంశములో ఆరవవాడు. రామాయణములో విశ్వామిత్రుడు ఉండినది అనుమానమే.”* t Pergiter.Ancient Indian Historical tradition P 64 キ "} } P 188

" 15 P 286