కవిత-గుణషణము షైజల్ అను జర్మన్ ప్రాచ్య విద్యాపండితుడు “రామాయణము ప్రపంచ పురాణములన్నింటిలో గంభీరమైనది (Ramayana is the noblest of epics)" అని అభిప్రాయమిచ్చెను. మోనియర్ విలియమ్స అను ఇంగ్లీషు పరిశోధకుడిట్లు వ్రాసెను: “రామాయణము సంస్కృత వాఙ్మయములోని మహానిధులలో ఒకటై యున్నది. మొత్తము సంస్కృత సాహిత్యమందు రామాయణముకంటె మనోహరతరమైన కవిత మరి లేదు. ఉత్తమ సాంప్రదాయక పవిత్రత, స్పష్టత, స్వాభావికత దాని శైలిలో కలవు. కవితా సన్నివేశము అతి మనోహర భావములతో కూడినట్టిది. దానిలో శౌర్య సంఘటనల ఉదార వర్ణనలు, ప్రకృతిలోని సుందరతమమైన రంగముల ప్రదర్శనము, మానవహృదయము నందలి గంభీరోద్రేకములు, వాటి పరస్పర సంఘర్ష ణముల గాఢపరిచయము ఇవన్నియు ఈ రామాయణమునకు సర్వ కాలములందును సర్వదేశములందును అతి సుందరమైన రచనలని ప్రఖ్యాతిగాంచిన కావ్యములలో అగ్రస్థాన మిచ్చుచున్నవి.”+ + Monier Williams says :- Ramayana is undoubtedly one of the greatest treasuries in Sanskrit Literature. There is not in the whole range of Sanskrit Literature a more charming poem than the Ramayana. The classi- cal purity, clearness, and simplicity of its style, the exquisite touches of true poetic feeling, with which
పుట:రామాయణ విశేషములు.pdf/223
Appearance