Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

172 రామాయణ విశేషములు "సర్వే చండస్య బిభ్యతి" (యు. 2-21) అందరును చండునికి భయపడుదురు. ఇదివరలో చూపిన 'మృదుర్తి పరిభూయతే' అను లక్ష్మణ నీతి కిది అనుబంధము. దాయా దులు మత్సరమును గురించి యుద్ధకాండ సర్గ 16 లో 3, 4, 5, 6, 7, 8, 9 శ్లోకాలలో చక్కగా వర్ణించినారు. మరియు సర్గ 18 లో 10, 14 శ్లోకాలను చూడుడు. “సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః." ప్రియముగా మాట్లాడేవారు చాలామంది. చెప్పువారును వినువారును మాత్రమే దుర్లభులు. (యుద్ధ. 16-20, 21) అప్రియమైన హితవు పిఱికితనము యొక్క నష్టములను గురించి హిందువులు బాగా అర్థము చేసుకొనవలెను అంగదుడు చెప్పిన నీతులలో ఇవి చాలా మైనట్టివి. చూడుడు: యుద్ధకాండ. సర్గ, 66 శ్లోకాలు 19 నుండి 27 వరకు "న కతనాత్ సత్పురుషా భవంతి" (యుద్ధ. 71-58) ఆత్మశ్లాఘనచే సత్పురుషులు కానేరరు. “పౌరుషేణతు యో యుక్తః సతు శూర ఇతి స్మృతః" (యు. 71-59) పౌరుషము కలవాడే శూరుడు. "యస్యార్థ సస్య మిత్రాణి, యస్యార్థ సస్య బాంధవాః యస్యార్ఖా స్స పుమాంల్లోకే, యస్యార్థా స్సచ పండితః" (యు. 88-85) ఈ శ్లోకాన్ని హితోపదేశములో ఉదాహరించినారు. “మరణాంతాని వై రాణి” (యు. 112–26) ఈ విధముగా రామాయణము నీతులకు నిధియై యుండుటచేత కూడ పూజ్యస్థానమును పొందియున్నది.