Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174 రామాయణ విశేషములు ఇతర పాశ్చాత్య పండితులును ఇట్టి అభిప్రాయములనే యిచ్చి యున్నారు. ఇక భారతదేశమందలి హిందువులు రామాయణమును గుగించి సదభిప్రాయమే కలవారై యున్నారనుటలో ఏ సందేహమును లేదు. రామాయణము హిందువులందరికినీ ఒక పవిత్ర గ్రంథము. దానిలోని ఉ తమ కవితను గురించి హిందూ పండితు లందరును అతి ప్రాచీన కాలమునుఁడి, అనగా కనిష్ఠము 2000 ఏండ్లనుండి అత్యుత్తమ మని అభిప్రాయమిచ్చుచు వచ్చుటయే గాక నిన్న మొన్నటివరకు సంస్కృతము నభ్యసించిన ప్రతి పండితుడును ఇతర కావ్యాలను ప్రారంభించుటకు ముందు రామాయణములో కొన్ని భాగములను మొదట చదువుకొనుచుండెను. ఎంతటి మహా కవి యైనను సరే, అతడే భాష యందైనను సరే కవిత్వము వ్రాసినను, మొట్ట మొదట వాల్మీకి మహర్షికి నమస్కారము చేయనిది ముందునకు సాగకుండెడువాడు. తుదకు రామా యణమును చదువని హిందువు కవియే కానేరడు అని చెప్పిన అతిశ యోకి కాదు. రామాయణములోని కవితా ప్రాశస్త్యమును గూర్చి మహా విద్వాం సులు నూర్లకొలదిగా ప్రాచీనము నుండియు నేటివరకు బహు విధముల తెలిపియున్నారు. అట్టి దానిని గురించి నేను మరల వ్రాయుట కాల హరణ హేతువున్నూ, పునరుక్తి దోషమున్నూ, తుదకు తలవని తలంపుగా భావ చౌర్యమున్నూ కావచ్చును. అలంకారికులు రామాయణ మహా భారతాదుల రచనానంతరము, తుదకు కాళిదాసుని యనంతరమే it bounds, its graphic descriptions of heroic incidents, nature's grandest scenes, the deep acquaintance it displays with the conflicting workings and the most refined emotions of the human heart, all entitle it to rank among the most beautiful compositions that have appecred at any period or and country. P. 191.