Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 రామాయణ విశేషములు "ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి" అనునట్టి దిట్టిదే. పది, అయిదు, నాలుగు వర్గాలలో పది అంటే వేట, జూదము, కామము, మదము మున్నగు వ్యసనాలని కొందరు, అసత్యలుబ్ధత్వాది దుర్గుణములని కొందరు చెప్పుదురు. పంచవర్గము లనగా అయిదు విధాల దుర్గములనియు, పంచవిధ వైరములనియు చెప్పుదురు. నాల్గువర్గాలనగా సామ దానాదులు, లేక చతుర్విధమిత్రులు అని చెప్పుదురు. సప్త వర్గములనగా రాజు, మంత్రులు, రాష్ట్రము, కోశము, సేన, మిత్రులు అనియు లేదా ఏడు విధములగు మిత్రులనియు చెప్పుదురు. అష్టవర్గ మనగా కృషి వాణిజ్య దుర్గములు, సేతు బంధములు (P. W. D), ఏనుగులను కూర్చుట, గనులను త్రవ్వుట, పన్నులు తీసికొనుట, క్రొత్త గ్రామాలను స్థాపించుట అనియు, లేదా పైశున్య సాహస ద్రోహాది దుర్గుణాలనియు చెప్పుదురు. త్రివర్గమనగా ధర్మార్థకామములనియు, ఉత్సాహ ప్రభుమంత్ర శక్తులనియు, లేక శత్రువుల క్షయ స్థానవృద్ధు లనియు చెప్పుదురు. “విద్యాతిస్రములు” అనగా త్రయీవార్తా దండ నీతులని చెప్పుదురు. షాడ్గుణ్యం అనగా సంధి విగ్రహాది షడ్గుణములు. వింశతి వర్గమనగా బాలుడు, వృద్ధుడు, దీర్ఘ రోగి, బంధు పరిత్యక్తుడు, భీరువు, లుబ్ధుడు, కామి, దేవబ్రాహ్మణ నిందకుడు, సత్యధర్మ రహితుడు మున్నగు 20 విధాలవారనియు, లేదా రాజద్రోహి, వనితాపహారి, పరస్వత్వావహారి, ధర్మదేవమిత్రాదివిరోధి, క్రూరుడు మున్నగు దుర్మార్గులనియు చెప్పుదురు.” ల L ఈ శ్లోకాలలోని రాజనీతి అస్పష్టముగా నున్నది. వ్యాఖ్యాతలు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించినారు. (వివరణకై పై శ్లోకాలపై వ్రాయబడిన గోవిందరాజాది వ్యాఖ్యాతల అభిప్రాయములను చూడ గలరు.) రామాయణమందలి రాజనీతి ఇంకను విపులముగా కలదు. ముఖ్యవిషయాలను మాత్రమే చూపించి వదలివేయుచున్నాను.