Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 185 మొదటి మూడువర్గాలు తప్ప తక్కిన అధికారులపై చారులను పెట్టి వారు అన్యాయములుకాని, రాజ దేశద్రోహములుకాని చేయకుండు నట్లుగా రాజులు విచారించుకొనుచుండెడివారు. కోటలను ఎల్లప్పుడును శత్రువులనుండి భయము లేకుండు నట్లుగా రక్షించు ఏర్పాట్లు చేయుచుండిరి. అందు ధనము, ధాన్యము, ఉదకము, యంత్రములు ఉంచుచుండిరి. యంత్రములను శత్రువులపై ప్రయోగించుటలో కుశలులగు శిల్పులను, బాణములను ప్రయోగించుటలో ప్రవీణులైన ధనుర్ధరులను అందు కాపుంచుచుండిరి. (అయో. 100-58) చాలా రాజు కుండవలసిన లక్షణములను రామాయణమందు తావులందు నిరూపించినారు. రాజు జితేంద్రియుడుగను, కామక్రోధాది వర్జితుడుగను, నిష్పాక్షికత కలవాడుగను, రాజ్యాంగవేత్తగను, ధైర్య స్థైర్యాది వీరగుణయుక్తుడుగను ఉండవలెనని తెలిపినారు. దశపంచ చతుర్వర్గా సప్తవర్గం చ తత్త్వతః అష్టవర్గం త్రివర్గంచ విద్యా స్తిస్రశ్చ రాఘవ ఇంద్రియాణాం జయం బుద్ధ్వా షాడ్గుణ్యం దైవమానుషం కృత్యం వింశతివర్గంచ తథా ప్రకృతిమండలం యాత్రాదండ విధానం చ ద్వియోనీ సంధివిగ్రహ' కచ్చిదేతాన్ మహాప్రాజ్ఞ యథావ దనుమన్యసే. (అయో. 100-68, 69, 70) ఈ శ్లోకాలలో కొన్ని సాంకేతికములు తెలిపినారు. రాజనీతి బోధించునప్పుడు పురాణాలలో అందందు ఇట్టి సాంకేతికములను వాడుట పరిపాటి. మహాభారతములో విదుర నీతిలో-