Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

164 రామాయణ విశేషములు వాడు. దేశకాల విరుద్ధములగు కార్యములు నాశనము చెందును. ఏ రాజు మంత్రులతో బాగా ఆలోచించి ఉత్తమ మధ్యమాధమ కార్యముల లక్షణ ముల నెరిగి పురుష ద్రవ్యసంపత్తు, దేశకాల విభాగము, వినిపాత ప్రతీ కారము, కార్యసిద్ధి కార్యారంభోపాయము అను అయిదు విధాలు నెరిగి యుండునో అతడు కార్యసిద్ధి పొందును. రాజు ధర్మార్థకామముల సద్వినియోగము నెరిగి యుండవలెను. పశువులవంటి బుద్ధిగలవారిని సభలో ఆలోచనకై చేర్చుకొనిన వారు వట్టి ప్రగల్భాలు ప్రకటించు చుందురు. అర్థశాస్త్రము తెలియని వారితో ఆలోచింపగూడదు. శత్రువుల వద్ద లంచములు గొన్న వారిని ఎరిగి రాజు అట్టివారిని పరిహరించవలెను.” (యుద్ధ. 93-3 నుండి 18 వరకు) రామాయణకాలమందు రాజ్యస్థిరత్వమునకు, అభివృద్ధికి, శత్రు వులనుండి బాగా రక్షణచేసికొనుటకు రాజులు మంచి వ్యవస్థను ఏర్పాటు చేసియుండిరి. ప్రజాపాలనమునకు గాను 18 విధములగు అధికార వర్గమును ఏర్పాటు చేసియుండిరి. వారిని "తీర్థములు" అని వ్యవహ రించిరి. కచ్చి దష్టాదశాన్యేషు స్వపక్షే దశపంచచ త్రిభి స్త్రిభి రవిజ్ఞాతై ర్వేత్సి తీర్థాని చారకైః. అయో. 100.36 ఈ 18 తీర్థా లేవనగా: (1) మంత్రులు, (2) పురోహితులు, (3) యువరాజు, (4) సేనాపతి, (5) దౌవారికులు, (6) అంతర్వం శికులు, (7) కారాగారాధికారులు, (8) కోశాధ్యక్షులు, (9) కార్య నియోజకులు, (10) ప్రాడ్వివాకులు (Judges), (11) సేనానాయకులు, (12) నగరాధ్యక్షులు (City Profect-Kotval), (18) కర్మాంతికులు, (14) సభాధికృతులు, (15) ధర్మాధికారులు, (16) దండపాలురు (Police), (17) దుర్గపాలురు, (18) రాష్ట్రాంతపాలకులు.