రామాయణ విశేషములు గుణవాన్ వా పరజన స్స్వజనో నిర్గుణోపివా నిర్గుణ స్స్వజన శ్రేయాన్ యః పరః పరఏవ సః య స్సపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవతే స స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్తై రేవ హన్యతే. 168 యుద్ధ 87-13, 14, 15, 16. “దుర్బుద్దీ! నీవు స్వజనమును వదలి పరులకు భృత్యుడవైతివి. దీనిని పెద్దలు నిందింతురు. స్వజనులలో నివసించుట మంచిదా, లేక పరుల నాశ్రయించి నీచుడై బ్రదుకుట మంచిదా? పరులు గుణవంతులే యగుదురుగాక. స్వజనులు గుణహీను లగుదురుగాక. గుణహీనులైనను స్వజనులే శ్రేయస్కరులు, పరులు పరులేకాని తన వారెన్నటికిని కారు. ఎవడు తనవారిని పరిత్యజించి పరపక్షములో చేరి వారిని సేవించు చుండునో వాడు తన పక్షము నాశనమైన తర్వాత పరులచేత తాను గూడ నాశనము పొందును.” హిందూస్థాన చరిత్రలో గ్రీకుదండయాత్ర నాటినుండి నేటివరకు అడుగడుగునకు దేశద్రోహులే కానవచ్చుచున్నారు. మనకు పైశ్లోకాలు నిత్యమననార్హములు. ఇంతకుముందు శూర్పణఖ యొక్క యు ఇంద్రజిత్తు యొక్క యు రాజనీతి పరిజ్ఞానమును వెల్లడించినాను. రాక్షసుల నీతికి ఆర్యుల నీతికి భేదములేదు వాల్మీకి అందరినోటను ఒకేవిధమగు రాజనీతిని ప్రకటించి నాడు. కుంభకర్ణుడుకూడ తన యన్న యగు రావణునికి అతని యవసాన దశలో మంచి రాజనీతిని ఈ విధముగా బోధించెను “హితుల మాటలు వినకపోవుట దోష హేతువు. పాపకర్మములు నరకపాతము కలిగించును. ఏ రాజు ముందు చేయవలసిన కార్యములను వెనుక, వెనుక చేయవలసిన వాటిని ముందు చేయుచుండునో అతడు నయానయములను తెలియని
పుట:రామాయణ విశేషములు.pdf/213
Appearance