162 రామాయణ విశేషములు సకాలములో చేయవలసిన విధులను ఏ రాజు నెరవేర్పడో అతని రాజ్యము నాశనమగును. తగని కార్యములు చేయునట్టివాడును, ప్రజలకు దర్శన మియ్యనివాడును, పరవశుడైనవాడును అగు రాజును జూచి ప్రజలు దూరముగా తొలగిపోదురు... క్రూరుడును, లుబ్ధుడును, గర్వితుడును, శతుడును, వ్యసనాసక్తుడును నగు రాజును గౌరవింపరు.” ప్రజలు - (Gr. 33-3,4,5,6,15,16) సుగ్రీవుడు తన వాగ్దానప్రకారము ఆచరించ లేదని లక్ష్మణుడు క్రుద్ధుడై అతనితో ఇట్లనెను: “బలవంతుడును, కులీనుడును, ఆర్తరక్ష కుడును, జితేంద్రియుడును, కృతజ్ఞుడును, సత్యవాదియు నగు లోకమందు పూజ్యుడగును అధర్ముడును, అసత్యవాదియు, కృతఘ్ను డును అగు రాజుకన్న నీచుడు మరిలేడు." రాజు _ (కిష్కి. 84-7, 8) సీత రావణునితో ఇట్లనెను: “తెలివిలేనివాడును, నీతిహీనుడును నగు రాజుయొక్క సమృద్ధమైన రాష్ట్రములు కూడ నశించును.” (సుంద. 21-11) రాక్షసులను వదలి వారి శత్రువులదగు రామవర్గమును ఆశ్ర యించిన భీషణుని ఇంద్రజిత్తు నిందించు వాక్యములు చాలా ఉత్తమ రాజనీతితో కూడినట్టివి. శోచ్య స్వ మసి దుర్బద్ధే నిందనీయశ్చ సాధుభిః యస్త్వం స్వజన ముత్సృజ్య పరభృత్యత్వ మాగతః నై తచ్ఛిథిలయా బుద్ధ్యా త్వం వేత్సి మహదంతరం క్వచ స్వజనసంవాసః క్వచ నీచపరాశ్రయః
పుట:రామాయణ విశేషములు.pdf/212
Appearance