రామాయణ విశేషములు 187 ఇక హితోపదేశ తుల్యమగు నైతికబోధ రామాయణ మందెట్లు నిరూపింపబడినదో సంగ్రహముగా తెలిసికొందము. జటాయువు ఆటవికుడు. రామునకు భృత్యుడు. రావణుడు సీత నెత్తుకొని దొంగయై పోవుచుండగా అతని కెదురై అనేక నీతులు బోధిం చెను. "పరదారలను తాకుట నీచమైన పని. ఇతరులు గర్హించు కార్య ములను బుద్ధిమంతుడు చేయరాదు. యథాత్మన స్తథాన్యేషాం దారా రక్ష్యా విమర్శనాత్. (ఆర. 50-7) (ఆర. 50-8) తన భార్యను పరపురుషులు అభిమర్శనము చేయకుండా ఎట్లు రక్షించుకొనవలెనో పరభార్యలను అట్లే రక్షించవలెను. రాజా ధర్మస్య కామస్య ద్రవ్యాణాం చోత్తమో నిధిః. (అర. 50-9 రాజు ధర్మార్థ కామములకు మూలము. రాజు పాపమాచరించిన జనులును అదేపని చేయుదురు. ఈ విధముగా బహునీతులను బోధిం చెను. (వివరములకై ఆరణ్య 50 అధ్యాయము పూర్తిగా చూడుడు) తుదకు తన స్వామి సేవలో జటాయువు రావణునితో యథాశక్తి పోరాడి ప్రాణము లర్పించెను. ఆటవికులలో ఇట్టి విశ్వాసపాత్రమగు సేవ రామాయణమందు పలుతావుల నిరూపింపబడినది. లక్ష్మణుడు దశరథునిపై కోపించుకొని ఇట్లనుచున్నాడు: గురో రప్యవలి ప్తస్య కార్యాకార్య మజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అయో. 21-13 తండ్రియైనను యుక్తాయుక్త కార్యవిచక్షణ లేనివాడగుచో అతనిని కుమారులు దండింపవలెను. ఇదే నీతి శ్లోకము భారతమున నున్నదని లోకమాన్య తిలకుగారు తమ గీతారహస్యమందు తెలిపియున్నారు.
పుట:రామాయణ విశేషములు.pdf/217
Appearance