Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 169 రాముడు రాజు కాబోవుచున్నాడు; అతి వృద్ధుడైన దశరథుడు తన యనుభవమునుబట్టి రాముడు ఎట్లు రాజ్యము చేయవలెనో బోధించెను: “రామా, సప్తవ్యసనము లందెప్పుడును లగ్నుడవు కావలదు. “అమాత్యప్రభృతీ స్సర్వాః ప్రకృతీ శ్చానురంజయ,” " ఆయో. 3_44 మంత్రులను మొదలుకొని సర్వప్రజలను సంతోష పెట్టుము కోష్ఠాగారాయుధాగారైః కృత్వా సన్నిచయాన్ బహూన్ తుష్టానుర క్షప్రకృతి ర్యః పాలయతి మేదినీం తస్య నందంతి మిత్రాణి, లబ్ధ్వమృత మివామరాః అయో. 3-45 కోఠాలను, ఆయుధములను, కోశములను బాగుగా సమకూర్చు కొని ప్రజలను బాగుగా సంతోష పెట్టి యేరాజు పాలించునో అతని మిత్రులు అమృతము పొందిన దేవతలవలె ఆనందింతురు.” ణు రాముడు వనవాసమునకు పోవలసివచ్చునని విని లక్ష్మణ డతనితో నిట్లనెను: "ఆర్యా, రాజు తమ ప్రజలను పుత్రులవలె కాపాడి పూర్వరాజర్షులవలె వృద్ధులైన తర్వాత వానప్రస్థాశ్రమములో చేరవలెను. తమ కుమారులకు రాజ్యమప్పగించి పోవలెను.” రామాయణములో అడుగడుగునకు ప్రజలను పుత్రులవలె పాలించవలెనని తెలిపినారు. రాజావిధముగా ప్రజలను ప్రేమించకుండిన అతడు కటికవాడుగాను ప్రజలు పశువులుగాను ఉందురని (సౌనికి పశవో యథా ఆయో. 48_28) రామాయణమే బోధించినది. దశరథుడు చనిపోయినప్పుడు అతని నల్వురు కుమారులలో ఇద్దరు వనవాసమందును ఇద్దరు మాతామహి గృహమందును ఉండిరి. రాజు లేకుండిన దేశ మరాజక మగుననియు దానివలన నీ క్రింది నష్ట