158 రామాయణ విశేషములు వసిష్ఠు డింకను విశ్వామిత్రు నిట్లు విచారించెను: "నీ భృత్యులను నీవు సరిగా పోషించుచున్నావా? వారు నీ ఆజ్ఞలను సరిగా పాలింతురా? నీ శత్రువుల నఁదరిని గెలిచినావు కదా? నీ సైన్యబలము మొక్కపోనిదిగా ఉన్నది కదా? నీ ధనకోశము లోపము లేనిదికదా? నీ మిత్రవర్గము బలీయముగా నున్నదికదా? ” ఈ విధముగా ఆ కాలమందు రాజులను విచారించుట పరిపాటియై యుండెను. దశరథుడు రామునికి యౌవరాజ్య పట్టాభిషేకము సేయ దల పెట్టెను. కాని ప్రజల అనుమతిని అతడు ముందుగా కోరెను. సామంత రాజులను నగర ప్రముఖులను పల్లె పెద్దలను అందరిని పిలిపించి వారి ఆనుమతిని అర్థించుచు (ఆయో. 1-51) వారితో నిట్లనెను: “ఆర్యులారా, మా పెద్దలు ప్రజలను తమ కుమారులవలె చూచు కొనుచు పరిపాలించినది మీ రెరుగుదురు కదా! నేనును పూర్వుల జాడ లలో యథాశక్తి నడిచినాను. నేను వృద్ధుడనైనాను. రాముడు నాకన్న శ్రేష్ఠుడు. అతనిని యువ రాజుగా చేయదలచితిని. యదిదం మే. నురూపార్థం మయా సాధు సుమంత్రితం, భవంతో మే2నుమన్యంతాం కథం వా కరవాణ్యహం. (ఆయో. 2-15) నా ఆలోచన సరియైనదేనా? నే నేమి చేయవలెను? నాకు సెల వియ్యగలరా?" ఈ మాటలను విని ప్రజ లేక వాక్యముగా మాకు రామ పట్టాభిషేకము సమ్మతమే అని పలికిరి. దశరథుడు మరల ఇట్లనెను: “నేను బాగుగా పరిపాలించుచున్నా ననుకొందును. నాలో ఏ లోపము లున్నవని నన్ను కాదని ఇంకొకరిని రాజుగా చేసుకొనుచున్నారు?” అని ప్రజల నడిగెను. వారప్పుడు రాముని ఉత్తమోత్తమ గుణములను వర్ణించి చెప్పిరి.
పుట:రామాయణ విశేషములు.pdf/208
Appearance